తెలుగు సినీ రంగంలో రాజశేఖర్-జీవితల స్టయిలే వేరు. ఒకరికొకరు.. అన్నట్టుగా వీరి జీవిత ప్రయాణం సాగుతోంది. అయితే.. వీరి జీవితం వడ్డించిన విస్తరి కాకపోవడం గమనార్హం. ఈ విషయం చాలా మందికి తెలియదు. జీవిత అసలు పేరు పద్మ. స్వస్థలం శ్రీశైలం. నాన్న రామనాథం. హెల్త్ ఇన్స్పెక్టర్. అమ్మ శకుంతల నర్స్. ఒక అక్క, అన్న, చెల్లెలు. తాత ఎన్టీఆర్ వద్ద అకౌంటెంట్‌గా పనిచేసేవారు.
తమిళ దర్శకుడు టి.రాజేందర్ ‘ఉరవై కార్తకిలి’ అనే తమిళ చిత్రంలో తొలిసారి హీరోయిన్గా నటించారు. 1991లో డా.రాజశేఖర్‌ను పెళ్ళి చేసుకున్నారు. దీనికి ముందు కోడి రామకృష్ణ తీసిన సినిమా తలంబ్రాలు లో ఇద్దరూ తొలిసారి కలిసి నటించారు. రాజశేఖర్ వాస్తవానికి తెలుగు వ్యక్తి కాదు. అయినా.. కూడా జీవిత ఆయనను ప్రేమించింది. అయితే.. అప్పటికే రాజశేఖర్ కుటుంబం ఆయనకు వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేసింది.
కానీ, జీవిత కుటుంబాన్ని సైతం ఎదిరించి.. ఆయనను పెళ్లి చేసుకుంది. ఒకానొక దశలో నాకు ఇంట్లో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని రాజశేఖర్ చెప్పినా.. పెళ్లి చేసుకుంటే.. చేసుకోండి.. నేను నీతోనే ఉండిపోతాను.. అని తన ప్రేమను వ్యక్త పరిచింది. ఆ రకంగా రాజశేఖర్‌కు దగ్గరైన జీవిత.. తర్వాత.. రాజశేఖర్ తన కుటుంబాన్ని పూర్తిగా వదిలేసి వచ్చిన తర్వాత.. అన్నీతానై ఆయనకు జీవితాన్ని ఇవ్వడంలో తన ప్రేమను చాటుకుంది.
అయితే, చిత్రంగా.. రాజశేఖర్.. మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు జీవితను పెళ్లి చేసుకున్నాక.. అకస్మాత్తుగా.. సినిమాలు ఫెయిల్ కావడం ప్రారంభమైంది. దీంతో ఒకానొక దశలో ఇద్దరూ కూడా తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. ఈ సమయంలోనే మరోసారి కోడి రామకృష్ణ వీరి జీవితాల్లోకి ఎంట్రీ ఇచ్చి ధైర్యం చెప్పారు. ముఖ్యంగా జీవిత డైరెక్టర్‌గా మెగా ఫోన్ పట్టుకున్నాక.. మరిన్ని ఇబ్బందులు వచ్చాయి.
అయినా తట్టుకుని.. జీవిత ప్రయాణాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇక, వీరి ఆస్తుల విషయానికి వస్తే.. హైదరాబాద్.. చెన్నైలలో ఉండే.. స్థిరాస్తుల నుంచి వచ్చే రెంట్ దాదాపు 4 లక్షలు ఉంటుంది. దీంతోనే ప్రస్తుతం వారు కాలం గడుపుతున్నారంటే.. ఆశ్చర్యం వేస్తుంది. తీసిన సినిమాలు తీసినట్టు ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. రాజకీయంగా కూడా కలిసి రాకపోవడం గమనార్హం.