Moviesరేణుదేశాయ్ అలాంటిది కాబ‌ట్టే ప‌వ‌న్ వ‌దిలేశాడా…!

రేణుదేశాయ్ అలాంటిది కాబ‌ట్టే ప‌వ‌న్ వ‌దిలేశాడా…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాజీ భార్య రేణు దేశాయ్ విడిపోయి పదేళ్లు దాటుతోంది. వీరిద్దరూ విడిపోయి ఇన్నేళ్లు అవుతున్న నిజంగా వీరిద్దరూ మల్లి కలిసిపోతే బాగుంటుంది అని కోరుకునే సినీ అభిమానులు ఎంతోమంది ఉన్నారు. నిజం చెప్పాలంటే పవన్ అభిమానుల్లో చాలామందికి రేణు దేశాయ్ అంటే ఎంతో ఇష్టం. రేణును ఇప్పటికీ వదిన అని ఎంతో ఆప్యాయత అనురాగాలతో పిలుస్తారు. పవన్ కళ్యాణ్ కు విడాకులు ఇచ్చేశాక రేణు పూణేలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది.

తాజాగా పవన్ – రేణు దంపతుల కుమారుడు అఖీరా నందన్ పుట్టినరోజు సందర్భంగా రేణు తన ఇన్‌స్టా వేదికగా అకిరాను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఒక వీడియో షేర్ చేసింది. ఎన్ని ఏళ్ళు వచ్చినా ఇప్పుడే పుట్టినట్టు ఉంది అంటూ కామెంట్ చేసింది. అయితే రేణు షేర్ చేసిన ఈ ఫోటోపై కొందరు పవన్ అభిమానులు స్పందించారు. మీరు ఇలా ఎప్పుడు మా అన్న కొడుకుని చూపిస్తూ ఉండండి.. అలా చూస్తే మాకు ఆనందంగా ఉంటుందని కామెంట్ చేశారు.

దీంతో రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ అన్న కొడుకు కాదు.. నా కొడుకు ఇలాంటి మాటలు ఎన్నో భరిస్తూ వచ్చాను.. ఇకపై భరించాల్సిన అవసరం లేదు.. బుర్ర దగ్గర పెట్టుకుని మాట్లాడమని ఘాటుగా రిప్లై ఇచ్చింది. దీంతో కొందరు పవన్ అభిమానులు రేణుకపై ఘోరంగా కామెంట్ చేశారు. మా అన్న కొడుకుని చూపించండి అంటే నెగిటివ్ కామెంట్సా ? 2024 ఎన్నికలకు ఈ చిల్లరది కొత్త స్టంట్‌ స్టార్ట్ చేసింది.. పవన్ కళ్యాణ్ బయోలాజికల్ ఫాదర్ అయినప్పుడు అన్న కొడుకు అనకుండా ఏమి అనాలి ? ఇలాంటి చిల్లర వేషాలు వేసినందుకే దీనిని పవన్ ఇంట్లో నుంచి బయటకు గెంటేసినట్టు ఉన్నాడు అని కామెంట్ చేశారు.

ఈ కామెంట్‌ను రేణు దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు.. మీరు ఒక మంచి కుటుంబం నుంచి వస్తే ఇలా ఎలా ? కామెంట్ చేయగలరు.. ఒకసారి మీ తల్లిని అడగండి ఇది కరెక్ట్ గా ఉందా ? అంటూ ఘాటుగా స్పందించింది. ఇది చూసిన చాలామంది.. ఒక మహిళను ఇంత దారుణంగా కామెంట్లు చేయడం ఎంతవరకు సమంజసం ? అని ప్రశ్నిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news