Moviesఇద్ద‌రు మొగుళ్ల‌తోనూ పిల్ల‌ల‌ను క‌న్న సినీ సెల‌బ్రిటీలు వీళ్లే…!

ఇద్ద‌రు మొగుళ్ల‌తోనూ పిల్ల‌ల‌ను క‌న్న సినీ సెల‌బ్రిటీలు వీళ్లే…!

సినిమా పరిశ్రమ అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఉండే సెలబ్రిటీలు సామాన్య ప్రజల కంటే విభిన్నమైన ఆలోచనలు కలిగి ఉంటారు. కొన్నిసార్లు సినిమా ఇండస్ట్రీలో జరిగే పరిణామాలు చూస్తుంటే బయట వాళ్లకు కూడా ఎంతో చిత్రవిచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. అయితే సాధారణ ప్రజలతో పోలిస్తే వారి లైఫ్ భిన్నంగా ఉండడంతో అవి ఆ సెలబ్రిటీలకు చాలా మామూలుగా అనిపిస్తూ ఉంటాయి. సినిమా పరిశ్రమలో ప్రేమలు.. పెళ్లిళ్లు చేసుకోవడం విడిపోవడం కామన్ గా జరుగుతూ వస్తుంది. అయితే కొందరు సినిమా సెలబ్రిటీలు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు భర్తలతో కూడా పిల్లలు కన్నారు. మరి ఆ లిస్టులో ఉన్న సినీ సెలబ్రిటీలు ఎవరో చూద్దాం.

శ్రీజ :
మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. శ్రీజ ముందుగా శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఒక పాప పుట్టాక మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. ఇక కొన్నేళ్ల క్రితం చిత్తూరు జిల్లాకు చెందిన కళ్యాణ్ దేవ్‌ను రెండోసారి వివాహం చేసుకున్నారు. వీరి దాంపత్య బంధానికి గుర్తుగా మరో కుమార్తె కూడా పుట్టింది. ఇలా ఇద్దరు భర్తలతో ఇద్దరు పిల్లలకు శ్రీజ జన్మనిచ్చింది. అయితే ఇప్పుడు కళ్యాణ్ – శ్రీజ కూడా దూరంగా ఉంటున్నారు. త్వరలోనే వీరు విడాకులు కూడా తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

రాధిక శరత్ కుమార్ :
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు రాధిక‌. ఆమె కెరీర్ పరంగా ఎంత సక్సెస్ఫుల్ హీరో అయినా.. వ్యక్తిగతంగా మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాధిక ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. రెండో భర్త ద్వారా ఒక కుమార్తెకు జన్మనిచ్చిన రాధిక ఆ తర్వాత సీనియర్ నటుడు శరత్ కుమార్‌తో ప్రేమలో పడి మళ్లీ పెళ్లి చేసుకుని ఒక కొడుకుకి జన్మనిచ్చారు. ఇలా ఇద్దరు భర్తలతో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.

సౌందర్య రజినీకాంత్ :
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తెలు ఇద్దరు మొదటి భ‌ర్తులకు విడాకులు ఇచ్చేసి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. పెద్ద కుమార్తె సౌందర్య మొదటి భర్తతో కొంతకాలం కాపురం చేశాక.. ఒక కొడుకుకు జన్మనిచ్చింది. అనుకోని కారణాలతో ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత సౌందర్య మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు కూడా ఒక కొడుకు పుట్టాడు.

అలా రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఆమె ఇద్దరు భర్తలతో ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చింది. ఈ ముగ్గురు సెలబ్రిటీలు మాత్రమే కాదు.. చాలామంది హీరోలు ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకొని ఇద్దరు భార్యలతోనూ పిల్లలను కన్నవారు ఉన్నారు. అలాగే చాలామంది సినిమా రంగంలో పనిచేసే నటులు, నటీమణులు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుని వేరువేరు భాగస్వాములతో పిల్లలను కనటం కామన్ అయిపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news