సినిమా రంగంలో ఉన్నన్ని పుకార్లు మరెక్కడ ఉండవు. ముఖ్యంగా నటీనటులకు సంబంధించి వ్యక్తిగత విషయాలతో.. పాటు వృత్తిపరమైన విషయాలు అందరికీ తెలుస్తూనే ఉంటాయి. టాప్ సెలబ్రిటీలు అయితే మీడియాతో పాటు వాళ్ళ అభిమానులు కూడా వారిపై ఎప్పుడు కన్నేసి ఉంచుతారు. కొందరు సెలబ్రిటీలపై లేనిపోని కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ పాపులర్ అయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఉమైర్ సంధు అని తనకు తాను చెప్పుకొని క్రిటిక్ ఇటీవల బాలీవుడ్ సెలబ్రిటీలపై రకరకాల గాసిప్‌లు, రూమర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తండ్రి, కొడుకులు అయిన తండ్రి ఫిరోజ్ ఖాన్, కుమారుడు ఫర్దీన్ ఖాన్ తో చాలా సార్లు పడకను పంచుకున్నట్లు చెప్పి పెద్ద బాంబ్ పేల్చాడు. దీనిపై సెలీనా కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఈ పోస్టును బట్టి చూస్తే నీకు శీఘ్ర స్కలన సమస్య ఉందని.. ఈ సమస్య పరిష్కారం కోసం డాక్టర్‌ను కలవాలని సలహా ఇచ్చింది.
సెలీనా కౌంటర్‌పై ఉమైర్ ఫైర్ అయ్యాడు. నోర్మూసుకో.. నువ్వు సీ గ్రేడ్ యాక్టర్‌వి… నీ సినిమాలు పోర్న్ సినిమాల మాదిరిగా ఉంటాయి… నువ్వొక సంపన్నుడిని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యావు.. నీవొక సైకో సెల్ఫిష్ ఉమెన్ అంటూ రెచ్చిపోయాడు. అలాగే జనాషీన్ సినిమా కోసం ఆడిషన్స్ కు వెళ్లి డైరెక్టర్ ఫిరోజ్ ఖాన్ ఎదుట కంప్లీట్ నగ్నంగా నుంచున్నావా ? లేదా ? అని ప్రశ్నించాడు.
అలాగే సెలీనా నటించిన సినిమా పోస్టర్లు కూడా షేర్ చేశాడు. పోర్నోగ్రఫీ సినిమాలు చేసినందుకు నీకు పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వాలని ఉమైర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్టర్ వార్ సోషల్ మీడియాను ఉడికిస్తోంది. ఇది ఎప్పటి వరకు కొనసాగుతుందో ? చూడాలి.