ఒక సినిమా అన్నాక కొన్ని నెలలపాటు అందరూ కలిసి పని చేయాలి. అయితే ఈ ప్రయాణంలో చిన్న చిన్న గొడవలు అలకలు, కామన్ గా జరుగుతూ ఉంటాయి. అభిప్రాయాలు కలవక పోవచ్చు.. అలాగే హీరోకు హీరోయిన్‌కు మధ్య ఏదైనా గొడవ రావచ్చు. అలాగే హీరో, దర్శకులు – దర్శకులు, నిర్మాతల మధ్య కూడా అభిప్రాయ బేధాలు ఉండటం కామన్. అయితే ఇటీవల కాలంలో హీరోలు, దర్శకులు మధ్య ఇలాంటి డిఫరెన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.
తాజాగా నిర్మాణంలో ఉన్న ఓ సినిమా కోసం ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశారు. అయితే దర్శకుడు ఐటెం సాంగ్ ఉంచాలా వద్దా ? అన్న విషయంలో క్లారిటీగా తేల్చుకోలేకపోతున్నాడట. ఉండాలని ఒకసారి.. కాదని ఒకసారి మాట్లాడుతున్నాడట. అయితే ఫైనల్ గా ఇది ఆ పాట చిత్రీకరణ మీద కూడా తడబాటు చూపించింది అట. దీంతో ఆ హీరో గారు ఆ దర్శకుడి మీద కాస్త చికాకు పడినట్టు తెలుస్తోంది. పాట వద్దు అని పక్కన పెట్టేసారట.
అయితే ఇప్పుడు మళ్లీ పాట ఉండాలని.. పాట ఉంటేనే సినిమాకు బెటర్ అవుతుందని యాడ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఇటీవల కాలంలో ఇలా డైరెక్టర్ – హీరోల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మాస్ మహారాజా రవితేజ సినిమాలకు ప్రతిసారి ఇలాగే వినిపిస్తోంది. ఖిలాడి – రామారావు ఆన్ డ్యూటీ అంతకుముందు ప్లాప్ సినిమాలతో పాటు తాజాగా వచ్చిన రావణాసుర సినిమా విషయంలోనూ రవితేజకు దర్శకులకు మధ్య పోసగక పోవటం అన్నది కామన్ అయిపోయిందని అంటున్నారు.
ఇలా దర్శకులతో గొడవలు పడే విషయంలో రవితేజ ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడన్న గుసగుసలు ఇండస్ట్రీలో ఉన్నాయి. ఇక ఇప్పుడు రామవరం సినిమా విషయంలో హీరో గోపీచంద్ దర్శకుడు శ్రీవాస్ మధ్య కూడా ఇలాంటి గొడవలు జరిగాయని అంటున్నారు. ఏది ఏమైనా ఈ తరహా గొడవలు ఇండస్ట్రీకి అంత మంచిది కాదని చెప్పాలి.