Moviesక‌రుణామ‌యుడు విజ‌య్‌చంద‌ర్ జీవితంలో ఇన్ని ట్విస్టులా..? పేకాట తెచ్చిన పాపులారిటీ..!!

క‌రుణామ‌యుడు విజ‌య్‌చంద‌ర్ జీవితంలో ఇన్ని ట్విస్టులా..? పేకాట తెచ్చిన పాపులారిటీ..!!

ఒక్కొక్క‌ళ్ల‌కు ఒక్కొక్క వ్య‌స‌నం ఉంటుంది. దీనిని ఎంత అదుపు చేసుకోవాల‌న్నా.. ఆగేది కాదు. ఇక‌, ఈ వ్య‌స నాన్ని వ్యాపారంగా మార్చేస్తే..ఇక‌, మ‌రో వ్య‌సనంగా మారిపోతుంది. ఇలానే.. త‌న వ్య‌స‌నంతో పైకి వ‌చ్చిన వారు కూడా ఉన్నారు. ద‌గ్గుబాటి రామానాయుడు ప్ర‌ముఖ నిర్మాత‌గా మార‌డానికి వెనుక‌.. గుర్ర‌పు పందేలు ఉన్నాయ‌ని చెబుతారు. ఆయ‌నే ఒక సంద‌ర్భంలో చెప్పుకొన్నారు కూడా..!

ఇక‌, విజ‌య్‌చంద‌ర్ విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న క్యారెక్ట‌ర్ న‌టుడిగా అనేక పాత్ర‌లు పోషించారు. ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్నారు. స‌రే.. ఆయ‌న సినీ ప్ర‌స్థానం విష‌యానికి వ‌స్తే.. మాత్రం.. విజ‌య్‌చంద‌ర్‌కు సినిమాల నిర్మాణంపై పెద్ద ఆశ‌లు ఉన్నాయి. అంతేకాదు.. ఎవ‌రూ చేయ‌ని పాత్ర‌లు చేయాల‌ని అనుకున్నారు. దీంతో ఆయ‌న సినిమా నిర్మాణం వైపు అడుగులు వేశారు.

ఇక‌, సినిమా రంగంలోకి ఎలా ప్ర‌వేశించారంటే.. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన మరో ప్రపంచం సినిమాలో జర్నలిస్టుగా విజ‌య‌చంద‌ర్‌కు అవకాశం ఇచ్చారు. తర్వాత కె.ఆర్.విజయ ప్రధాన పాత్రలో నిర్మించిన దేవీ లలితాంబ సినిమాలో విలన్ గా నటించాడు. తరువాత ఆయన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పిన సినిమా కరుణామయుడు. ఈ సినిమా విడుదలకు నాలుగేళ్ళు సమయం పట్టినా అద్భుతమైన స్పందన వచ్చింది.

ఈ సినిమా కోసం.. విజ‌య‌చంద‌ర్‌.. ప‌డ‌రాని పాట్లు ప‌డ్డారట‌. సినిమా తీయాల‌ని అనుకుంటే.. ఎవ‌రూ ముందుకు రాలేదు. దీంతో తానే ఎందుకు తీయ‌కూడ‌ద‌ని భావించి.. రంగంలోదిగారు. చేతిలో డ‌బ్బులు అయిపోయాయి. దీంతో ఆయ‌న పేకాట ఆడి తెచ్చిన సొమ్ముతో.. ఈ సినిమాను తీశారు. అంతేకాదు.. షూటింగుల‌కు విరామం ఇచ్చిన స‌మ‌యంలోనూ పేకాట ఆడేవార‌ట‌. ఇది.. స్వ‌యంగా ఆయ‌నేచెప్పారు.

త‌ర్వాత‌.. అదే పంథాలో రాజాధిరాజు, దయామయుడు, ఇలా వరుసగా సినిమాలు నిర్మించాడు. 1985 లో దర్శకుడు పి.వాసు తీసిన షిరిడీ సాయిబాబా మహత్యం ఆయన కెరీర్ ను మలుపు తిప్పిన మరో సినిమా. ఇంకా ఎన్.శంకర్ తీసిన భద్రాచలం సినిమా కూడా మంచి పేరు తీసుకుని వచ్చింది. మాట‌లో మాట‌.. విజ‌య‌చంద‌ర్ ఎవ‌రంటే.. మ‌న ఏపీ తొలి ముఖ్య‌మంత్రి టంగుటూరి ప్ర‌కాశం పంతులు.. కుమార్తె కొడుకు!! ఆశ్చ‌ర్యం అనిపించినా.. నిజం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news