Moviesశాకుంతలం ఎక్స్ క్లూజివ్ : కచ్చితంగా ఈ సినిమా చూడాల్సింది వాళ్లే.....

శాకుంతలం ఎక్స్ క్లూజివ్ : కచ్చితంగా ఈ సినిమా చూడాల్సింది వాళ్లే.. ఎందుకంటే..?

ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందో మనందరికీ బాగా తెలిసిందే. రామాయణం – మహాభారతం ఇలాంటివి ఏవి వినట్లేదు .. చూడట్లేదు. కేవలం మొబైల్స్ లో రైమ్స్ ..కోకో మెల్లన్.. బేబీ షార్క్ ఇలాంటి రైమ్స్ తోనే కాలాన్ని గడిపేస్తున్నారు . ఇక ఈ జనరేషన్ యూత్ అంటారా నేటి కాలం రిలీజ్ అవుతున్న పిచ్చి సినిమాలు చూస్తున్నారు తప్పిస్తే ..ఎక్కడ దైవ ధ్యానం ..మన చరిత్ర ..మన పురాణాల గురించి పట్టించుకోవడం లేదు . కచ్చితంగా అలాంటి వాళ్ళు శాకుంతలం సినిమా చూడాల్సిందే అంటున్నారు సినిమా చూసిన పెద్దవాళ్లు .

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన శాకుంతలం సినిమా.. కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ ను నమోదు చేసుకుంది . కొంతమంది జనాలు శకుంతలం సినిమా బాగుంది అంటుంటే .. మరి కొంతమంది జనాలు తలనొప్పి వస్తుంది అంటూ బూర్ర బాదుకుంటున్నారు. అయితే శాకుంతలం సినిమా నేటి కాలం జనరేషన్ కి అర్థం కాకపోవచ్చు అని.. కానీ అందులో ఉన్న రియల్ ఫీలింగ్ ని అర్థం చేసుకుంటే ఇంతకన్నా గొప్ప సినిమా ఏది లేదు అంటూ చెప్పుకొస్తున్నారు సినిమా చూసిన పెద్దవాళ్లు .

అంతేకాదు డైరెక్షన్ పరంగా గుణశేఖర్ సక్సెస్ కాకపోవచ్చు.. నటన పరంగా సమంత కూడా మైనస్ మార్కులు దక్కించుకోవచ్చు.. కానీ కథ ఎవరు తీసిన ఎన్నిసార్లు తీసిన ఆ కథలో మార్పు రాదు ..స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నం ఇదే.. నేటి కాలంలో డేటింగ్ అంటూ హద్దులు మీరుతున్న లవర్స్ కి ఈ సాంప్రదాయాలు ఈ విలువలు బాధ్యతలు తెలియకపోవచ్చు . కానీ నేటి కాలం జనరేషన్ కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇదే అంటూ చెప్పుకొస్తున్నారు .

మరి ముఖ్యంగా ప్రేమ అంటే శరీరానికి సంబంధించింది కాదు అని.. మనసుకు సంబంధించిందని.. నమ్మిన వ్యక్తిని ..ప్రేమించిన వ్యక్తికి మనసిస్తే ఆ మనిషి మనల్ని ఎలా చూసుకుంటాడో తెలియచెప్పే గొప్ప ప్రేమ కావ్యమే ఈ శాకుంతలం అంటూ చెప్పుకొస్తున్నారు . అందుకే నేటి కాలం ప్రేమికులు ఈ కాలం యంగ్ జనరేషన్ ఈ సినిమా ఖచ్చితంగా చూడాలని.. అప్పుడే వాళ్లు అసలైన ప్రేమను ఎంజాయ్ చేస్తారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news