నగ్మ.. ఉత్తరాదికి చెందిన నటి. తెలుగు ప్రేక్షకులకు ఒకానొక దశలో ఆరాధ్య నటీమణిగా మారిపోయింది. ముఖ్యంగా చిరు.. రిక్షావోడు సినిమాతో మెగా అభిమానులకూ చేరువైంది. ఇక, వారసుడు సినిమాలో నాగార్జు నతోనూ కలిసి నటించింది. మేజర్ చంద్రకాంత్ సినిమాలో మోహన్‌బాబు సరసన నటించింది. ఇలా.. విభి న్నమైన పాత్రలకు.. కేరాఫ్‌గా మారిన నగ్మా.. అనేక మంది హీరోలతో కలిసి నటించింది. అదేవిధంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా అదేసమయంలో పేరు తెచ్చుకుంది.
జూనియర్ నటించిన అల్లరి రాముడు సినిమాలో నగ్మా క్యారెక్టర్ పాత్ర పోషించారు. అయితే.. కొందరు బాలీ వుడ్ నటులు.. తెలుగులో ఇమడలేకపోయినప్పటికీ.. నగ్మా మాత్రం చాలా వరకు అవకాశాలను చేజిక్కించు కుంది. అనేక సినిమాల్లో నటించింది. అయితే.. ఈమె కూడా.. అనూహ్యంగా తెలుగు హీరోతో ప్రేమలో పడడం ఒకప్పుడు పెద్ద ఎత్తున చర్చగా మారింది. ఒక మెగా నిర్మాత కుమారుడు.. హీరో కూడా అయిన వ్యక్తితో ఆమె ప్రేమలో పడడం ఇండస్ట్రీలో చర్చగా నిలిచింది.
నిజానికి ప్రేమలు కామనే అయినా.. నగ్మాకు.. సదరు హీరోకు మధ్య 20 ఏళ్ల గ్యాప్ ఉండడంతో ఈ విషయం పై అప్పట్లో పెద్ద ఎత్తున గ్యాసిప్‌లు వినిపించాయి. నిర్మాతగా ఉన్న ఆయన తన కుమారుడిని హెచ్చరించా రని..దీంతో నగ్మా..సదరు హీరో ఇద్దరూ కొన్నాళ్లపాటు దుబాయ్‌లో ఉండిపోయారని 1990లలో ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు ఇద్దరూ వదులుకున్నారు కూడా!
అయితే.. వీరి ప్రేమ ఎక్కువకాలం నిలబడలేదు. ఎందుకంటే సదరు హీరోకు అప్పటికే పెళ్లి కావడం పిల్ల కూడా ఉండడంతో నగ్మా.. ఉత్తరాదికి జంప్ అయ్యారు. తర్వాత ఆటోమేటిక్‌గా.. సినిమాలు తగ్గించి.. రాజకీయాలవైపు వెళ్లారు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. తన ప్రేమ ఫలించాలని నగ్మా.. శ్రీకాళహస్తిలో పూజలు చేయించారని వార్తలు రావడం. దీనిలో నిజం ఎంతో తెలియదు కానీ.. ప్రతి నెలా ఆమె అక్కడ దర్శనమిచ్చేది. ఇదీ .. సంగతి!