సినిమా రంగంలో హీరోలు, హీరోయిన్లు ఎంత గుట్టుగా తమ ఎఫైర్లు దాచుకుందామని అనుకున్నా దాగవు. కొందరు తమ ఎఫైర్ల గురించి ఓపెన్ అవుతారు.. తాము ప్రేమలో ఉన్నామని చెప్పేస్తారు. ఇక మీడియా వెంటపడినప్పుడు ఫోటోలకు ఆంక్షలు లేకుండా ఫోజులు ఇస్తూ ఉంటారు. కొందరు మాత్రం చాలా సీక్రెట్ గా తమ ఎఫైర్ కొనసాగించాలని చూస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వాళ్ళు తమ భాగస్వామితో ఎక్కడో ఒకచోట ఎంజాయ్ చేస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోతూ ఉంటారు.
ఇక మిల్కీ బ్యూటీ తమన్నా, తన ప్రియుడు విజయ వర్మ డేటింగ్ ముచ్చట మొన్న మొన్నటి వరకు పుకార్లకు మాత్రమే పరిమితం అయింది. అయితే ఇప్పుడు ఇద్దరూ ఎక్కడ చూసినా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. కెమెరాలకు ఫోజలు కూడా ఇస్తున్నారు. తమ ప్రేమా విషయాన్ని వీళ్ళిద్దరూ బయటకు చెప్పట్లేదు. అయితే ఎక్కడ చూసినా కలిసి కనిపిస్తున్నారు.
తాజాగా తమన్నా – విజయవర్మ ఇద్దరూ ముంబైలో ఓ రెస్టారెంట్ కు డిన్నర్ కు వెళ్లారు. డిన్నర్ పూర్తయిన తర్వాత విజయ్ వర్మ తమన్నాను స్వయంగా తన కారులో ఇంటికి తీసుకు వెళ్ళాడు. అదే టైంలో మీడియా కెమెరాలు క్లిక్ మన్నాయి. దీంతో తమన్నా తన ప్రియుడి కారులో ప్రియుడి ఇంటికి వెళుతూ అడ్డంగా దొరికిపోయింది. ఇక ఈ ఏడాది కొత్త సంవత్సరం పార్టీ సందర్భంగా తమన్నా – విజయ్ ఎఫైర్ తొలిసారిగా బయటపడింది.
తమన్నా ఏకంగా విజయ్‌కు లిప్ కిస్ ఇస్తున్న ఫోటో బయటకు వచ్చింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి లాంగ్ డ్రైవ్ కి వెళ్లి మరి ఎంజాయ్ చేశారు. ముంబైలో పలు పార్టీలకు హాజరవుతున్నారు. తాజాగా ఇద్దరు కలిసి డిన్నర్ డేట్ ఎంజాయ్ చేశారు. త్వరలోనే వీళ్ళిద్దరూ తమ రిలేషన్షిప్ అధికారికంగా బయటపెట్టేలా ఉన్నారు. విచిత్రం ఏంటంటే వీళ్ళ రిలేషన్షిప్ కు తమన్నా తల్లిదండ్రుల నుంచి తీవ్ర అభ్యంతరం ఎదురవుతున్నట్టు తెలుస్తోంది.