సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా సరే.. సిమ్రాన్ కు ఉండే క్రేజ్ ..రేంజ్ ..ఫ్యాన్ ఫాలోయింగ్ మరి ఏ హీరోయిన్ కి లేదని చెప్పాలి . అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో సిమ్రాన్ పేరు చెప్తే జనాలు పూనకాలు వచ్చినట్లు ఊగిపోయారు . మరి ముఖ్యంగా తెలుగులో ఉండే బడా బడా హీరోలు కూడా సిమ్రాన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆమెతో నటించాలని తెగ తాపత్రయ పడిపోయేవారు . అందుకోసమే సిమ్రాన్ కోసం తమ కాల్ షీట్స్ ని సైతం ఖాళీగా పెట్టేవాళ్ళు .
మరీ ముఖ్యంగా తెరపై బాలకృష్ణ – సిమ్రాన్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్టుగా నిలిచి బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసింది . ఆ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న పెయిర్ ఏది అంటే మాత్రం ఖచ్చితంగా సిమ్రాన్ – నాగార్జున అనే చెప్పాలి . వీళ్లిద్దరి కాంబోలో నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హీట్ అయ్యాయి .
మరీ ముఖ్యంగా వీళ్ళ మధ్య రొమాంటిక్ సీన్స్ అప్పట్లో హైలైట్ గా నిలిచాయి. దానికి మెయిన్ రీజన్ నిజంగానే సిమ్రాన్ నాగార్జునని ఇష్టపడుతుంది అని అప్పట్లో జనాలు చెప్పుకొచ్చేవారు . అంతేకాదు నాగార్జున – సిమ్రాన్ పెళ్లి కూడా చేసుకోవాలనుకునిందని .. ఇదే విషయాన్ని ఏఎన్ఆర్ తో చెప్పిందని కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే నాగార్జునకి సిమ్రాన్ పై అలాంటి ఒపీనియన్ లేదని తెలుసుకున్న సిమ్రాన్ పెళ్లి పెటాకులు చేసుకొని మరి ఆయనతో సినిమాలో నటించడమే మానేసింది అంటూ అప్పట్లో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యింది. ప్రెసెంట్ సిమ్రాన్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటే ..నాగార్జున తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు..!!