టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు రెబల్ హీరో ప్రభాస్ . సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . మరీ ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. ఆఫ్ కోర్స్ బాహుబలి సినిమా తర్వాత ఇప్పటివరకు చెప్పుకోదగ్గ హిట్ అందుకొని ప్రభాస్ పేరు ఇప్పటికీ మారుమ్రోగిపోతుంది అంటే కారణం బాహుబలి సినిమా అని చెప్పాలి .
అంతేనా సినిమాకి వంద నుంచి 150 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ క్రేజీ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ..ప్రెసెంట్ చేస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవల్ లోనే తెరకెక్కుతున్నాయి . సినిమాల పరంగా దూసుకుపోతున్న ప్రభాస్ కృష్ణంరాజు చనిపోయిన తర్వాత తన పెళ్లి విషయాన్నీ అస్సలు పట్టించుకోవడం లేదు అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది .మరీ ముఖ్యంగా కృష్ణంరాజు బ్రతికున్నప్పుడు ఆయనకు ప్రామిస్ చేశారని.. ఖచ్చితంగా 2023లో పెళ్లి చేసుకుంటాను అంటూ మాటిచ్చారని ఓ న్యూస్ వైరల్ అవుతుంది .
అయితే కృష్ణంరాజు మరణించిన తర్వాత ఆ మాటను గాలికి వదిలేసిన ప్రభాస్ .. తన పెళ్లిపై ఊసే ఎత్తడం లేదు. వాళ్ళ అమ్మగారు బలవంతం చేసినా సరే కామ్ గా ఉంటున్నారట . అటు పక్క అనుష్క కూడా పెళ్లి ఇప్పట్లో చేసుకునేటట్టే కనిపించడం లేదు . ఈ క్రమంలోనే అనుష్క ప్రభాస్ ఫాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు . మీరు పెళ్లి అయినా చేసుకోండి.. కనీసం వేరు వేరుగా అయినా లైఫ్ లో పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వండి .. ఇలా ఎటూ కాకుండా మిగిలిపోకండి అంటూ మండిపడుతున్నారు . మరికొందరు కచ్చితంగా 2023 ప్రభాస్ – అనుష్కకు పెళ్లి అయిపోతుంది అంటూ జోష్యం చెప్పుకొస్తున్నారు..!!