మెగా మాజీ అల్లుడుగా సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతున్న కళ్యాణ్ దేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజని రెండో పెళ్లి చేసుకొని మెగా ఇంటికి రెండు అల్లుడుగా వెళ్ళిన కళ్యాణ్ దేవ్ .. ప్రెసెంట్ ఆ పోజీషన్ ని కూడా మాజీ చేసేసుకున్నాడు . తప్పు ఎవరిదో తెలియదు కానీ.. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్నారు అంటూ దాదాపు ఫిక్స్ అయిపోయింది . అఫీషియల్ గా ఇప్పటివరకు ఈ విషయాన్ని బయటకు పెట్టకపోయినా సరే.. ఇద్దరు దూరం దూరంగా ఉంటున్నారు అంతే.
కాగా వీరిద్దరికి పుట్టిన పాప కూడా శ్రీజ దగ్గరే ఉంది . వీళ్ళు కలిసి దాదాపు ఏడాది కంప్లీట్ అవుతుంది . ఈ క్రమంలోనే వీళ్ళు కచ్చితంగా విడాకులు తీసుకున్నారు అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు . దీనికి తగ్గట్టే శ్రీజ – కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో రకరకాలుగా పరోక్షకంగా కామెంట్స్ చేసుకుంటూ .. సెన్సేషనల్ పోస్టు చేస్తూ వచ్చారు. రీసెంట్గా కళ్యాణ్ దేవ్ మెగా డాటర్స్ ని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్ చేశాడు అంటూ ఆయన పోస్ట్ ఆధారంగా ట్రోల్ చేస్తున్నారు అభిమానులు .
“కొందరు జనాలను చూస్తుంటే పాపం అనిపిస్తుంది . వాళ్ళకి తెలిసింది గోరంత ..తెలియాల్సింది కొండంత “అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ఈ క్రమంలోని శ్రీజ ..కళ్యాణ్ దేవ్ విడాకులలో ఎవరైతే కళ్యాణ్ దేవ్ ని తప్పుపడుతున్నారు వాళ్ళకి కౌంటర్ లా ఉంది ఈ పోస్ట్ అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ఇప్పటికే సోషల్ మీడియాలో మెగా డాటర్ శ్రీజ – మెగా డాటర్ నిహారిక విడాకులు వార్తలు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతున్న
క్రమంలో కళ్యాణ్ ఇలాంటి పోస్ట్లు పెట్టడం వైరల్ అవుతుంది . అంతేకాదు కళ్యాణ్ టైం చూసి కొట్టాడు రా బాబు అంటూ మెగా హేటర్స్ చెప్పుకొస్తూ ఉంటే .. ఆడపిల్లలపై ఇలాంటి వ్యాఖ్యలతో ట్రోల్ చేయకూడదు అంటూ మెగా ఫ్యాన్స్ పరోక్షంగా మెగా డాటర్స్ ని వెనకేసుకొస్తున్నారు. దీంతో కళ్యాణ్ దేవ్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది..!!