అక్కినేని హీరో అఖిల్ కెరీర్ ప్రారంభం నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. అఖిల్ కెరీర్ పడుతూ లేస్తూ వస్తోంది. అఖిల్ ఇండస్ట్రీ లోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ కెరియర్లో సరైన హిట్ సినిమా దక్కలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా అంతంత మాత్రమే ఆడింది. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా అయితే రెండున్నర సంవత్సరాలుగా నానుతూ నానుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈనెల 28న ఈ సినిమా థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే.
సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు ఇప్పటికే లెక్కకు మించి బడ్జెట్ అయింది. ఈ సినిమాకు అయిన బడ్జెట్ కు, ప్రి రిలీజ్ బిజినెస్‌కు మధ్య పోలిక లేదు. అఖిల్ సైతం రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఫ్రీగానే చేశాడు అన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. అయితే రిలీజ్ ముందే ఈ సినిమాకు సరికొత్త సమస్య ఎదురవుతుంది. ఈ వారం ఏజెంట్ తో పాటు మణిరత్నం పొన్నియన్ సెల్వర్ 2 సినిమాలు విడుదలవుతున్నాయి.
ఇక సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా ఇప్పటికే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రెండో వారంలోనూ విరూపాక్ష సినిమాకు చాలా థియేటర్లు కేటాయించాలి. రెండో వారంలోను విరూపాక్ష చాలా స్ట్రాంగ్ గా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏజెంట్ విడుదలైన మరుసటి వారం గోపీచంద్ రామబాణం – అల్లరి నరేష్ ఉగ్రం సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాలకు కూడా కొన్ని థియేటర్లు కేటాయించాలి.
ఇక నైజాంలో ఏజెంట్ – పిఎస్ 2 రెండు సినిమాలను దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. అయితే కీలక థియేటర్లు అన్ని పీఎస్ 2 కు ఇచ్చినట్టు తెలుస్తోంది. అటు ఉత్తరాంధ్ర లోను మంచి థియేటర్లు కొన్ని పీఎస్ 2 సినిమాకు వెళ్ళిపోతున్నట్టు తెలుస్తుంది. ఇండస్ట్రీలో కావాలనే కొందరు ఏజెంట్ సినిమాను టార్గెట్ చేస్తున్నారు అని.. పంపిణీ రంగంలో ఉన్న పోటీ వల్లే ఇదంతా జరుగుతోందని అంటున్నారు.
అందుకే ఏజెంట్ సినిమాకు మరి ఎక్కువ థియేటర్లు దొరకలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా ఏజెంట్ సినిమాకు మంచి టాక్ వస్తే ఇబ్బంది ఉండదు. లేకపోతే ఉన్న థియేటర్లు కూడా పీకేసి రెండో వారంలో గోపీచంద్, అల్లరి నరేష్ సినిమాలకు ఇటు సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాలకు కేటాయించే ప్రమాదం లేకపోలేదు. ఇప్పుడు దీనిపై ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.