టాలీవుడ్ స్టార్ దంపతులు రామ్ చరణ్ ఉపాసన పెళ్లయ్యాక 11 ఏళ్ల తర్వాత తొలిసారిగా వీరు తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నారు. మెగా ఫ్యామిలీ అభిమానులు తమ అభిమాన హీరో రామ్ చరణ్ ఎప్పుడు ? తండ్రి అవుతాడా అని ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూపులు చూస్తూ వస్తున్నారు. చివరకు మీడియా వాళ్లతో పాటు అభిమానుల నుంచి చిరంజీవికి కూడా ఈ ప్రశ్న ఎన్నోసార్లు ఎదురయింది.
ఎట్టకేలకు ఉపాసన తల్లి అవుతుండడంతో ఇప్పుడు మెగా అభిమానులు సోషల్ మీడియాలో చెర్రీ – ఉపాసన దంపతులకు ముందుగానే శుభాకాంక్షలు చెబుతున్నారు. వీళ్లకు పుట్టబోయే బిడ్డ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఓ మీడియా సంస్థతో ముచ్చటించిన ఉపాసన తన జీవితంలో జరిగిన కొన్ని చేదు సంఘటనలను తలుచుకొని ఎంతో బాధపడింది.
చరణ్, తాను కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకున్నాం.. ఆ తర్వాత మా పరిచయం స్నేహంగా మారి.. ప్రేమ నుంచి పెళ్లి వరకు వెళ్లిందని ఉపాసన చెప్పింది. మా ఇద్దరి వృత్తులు, కుటుంబ నేపథ్యాలు వేరు అయినా కూడా మా నమ్మకం, ప్రేమే మమ్మలను ఈ స్థాయి వరకు తీసుకువచ్చిందని ఉపాసన తెలిపింది. ఇక తాను పెళ్లైన కొత్తలో బాడీ షేమింగ్ పై ట్రోలింగ్‌కు గురైయ్యానని.. తాను అందంగా లేనని.. చెర్రీ కేవలం డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకున్నానని.. ఇలా రకరకాల విమర్శలు చేశారని ఉపాసన ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే ఆ రోజు తాను ఏ మాత్రం కుంగిపోలేదని.. నాడు తనపై విమర్శలు చేసిన వారే.. ఈ రోజు తనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారంటూ ఉపాసన హ్యాఫీ ఫీల్ అయ్యింది. ఇక ఉపాసన అపోలో హాస్పటల్స్ బాధ్యతలు చూస్తూ ఇటు తనకు భర్త వ్యాపారాల్లో సాయం చేస్తూ ఉంటుంది.