సంఘవి.. హీరోయిన్ గుర్తుందా? కృష్ణ వంశీ తొలిసినిమా.. సింధూరంలో జేడీ చక్రవర్తితో కలిసి నటించిన హీరోయిన్. ఆ తర్వాత.. పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. పైగా.. ఎక్కువ సినిమాల్లో కూడా నటించ లేదు. దీనికి… ఆమె ప్రేమే కారణమని అంటారు సినీ పండితులు. ఒక దర్శకుడితో ఆమె ఎఫైర్ పెట్టుకోవ డంతో.. ఆమె సినిమాలకు కూడా మంచి పొజిషన్‌లోనే గుడ్ బై చెప్పారనే టాక్ ఉంది.
సంఘవి కర్ణాటకలోని మైసూరులో జన్మించింది. సంఘవి చిన్ననాటి నుంచే మోడలింగ్ చేయటం ప్రారంభించింది. సంఘవి బాల్యనటిగా సినిమాలలో నటించడం ప్రారంభించింది. ప్రముఖ కన్నడ సినిమా నటి ఆరతి, సంఘవి నాయనమ్మకు చిన్న చెల్లెలు. ఆరతి సినిమా షూటింగులకు వెళ్ళినప్పుడల్లా సంఘవి ఆమె వెంట వెళ్ళేది. అప్పుడే సినిమాలలో నటించాలన్న అభిరుచికి బీజం పడింది.
తొలిసారి.. తమిళ సినిమాతో సంఘవి అరంగేట్రం చేసింది. అజిత్ సరసన నటించిన సంఘవి తొలి సినిమా అమరావతి. తర్వాత అనూహ్యంగా కృష్ణ వంశీ కంట్లో పడిన సంఘవికి సింధూరం సినిమా పెద్ద మలుపు తీసుకువచ్చింది. ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకుంది. అయితే.. తర్వాత.. శివయ్య సినిమా షూటింగ్ సమయంలో తెలుగు సినిమా దర్శకుడు సురేష్ వర్మతో ఎఫైర్ మొదలైంది.
ఇది ప్రేమగా మారి ఇరువురు పెళ్ళి చేసుకున్నారన్న పుకార్లు వచ్చాయి. వీరు సీక్రెట్‌గా కాపురం కూడా పెట్టారని అనేవారు. దీంతో సంఘవి కొన్నాళ్లు సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత సినీరంగంలోకి మళ్లీ వచ్చిన సంఘవి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడం విశేషం. లాహిరి లాహిరి లాహిరిలో, ఆడవాళ్లు మీకు జోహార్లు, ఆదివారం ఆళ్లవాకు సెలవు.. వంటి సినిమాల్లో నటించింది. ఆనై అనే తమిళ చిత్రంలో తల్లి పాత్ర పోషించింది. పలు టీవీ సీరియల్స్‌లోనూ సంఘవి నటించడం గమనార్హం.