Moviesసమంత పుట్టిన రోజు.. చైతన్య చేసిన పనికి షాక్ అవుతున్న అక్కినేని...

సమంత పుట్టిన రోజు.. చైతన్య చేసిన పనికి షాక్ అవుతున్న అక్కినేని అభిమానులు..ప్రేమ అంటే ఇదే కదా..!!

నేడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె సినిమా పోస్టర్స్ ను ఆమెకు సంబంధించిన న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు సమంత ఫ్యాన్స్. అంతేకాదు సమంత జాన్ జిగిడి దోస్తులు సమంత బాగుండాలి అని కోరుకునే వ్యక్తులు ఆమెకు స్పెషల్గా విష్ చేస్తూ సమంత ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం అంటూ మెసేజ్ చేస్తున్నారు .

అయితే ఇదే క్రమంలో సమంత అంటే పడని వారు కూడా వ్యంగ్యంగా ఆమెకు విషెస్ చేస్తూ ఉండడం గమనార్హం . కాగా సమంత పుట్టినరోజు నాగచైతన్య చేసిన పని ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . మనకు తెలిసిందే సమంత – నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . కానీ పట్టుమంటూ పది కాలాలపాటు కాపురం చేయకుండానే విడాకులు తీసుకున్నారు .

వీరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్న ఈ జంట ప్రజెంట్ సింగిల్గానే తమ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. నాగచైతన్య కస్టడి సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటే సమంత సిటాడిల్ , ఖుషి సినిమా షూటింగ్లో బిజీగా ఉంది . ఈ క్రమంలోనే మాజీ భార్య పుట్టిన రోజు సందర్భంగా నాగచైతన్య పొద్దున్నే గుడికి వెళ్లి..సమంత ఆరోగ్యం బాగుండాలి అంటూ దండం పెట్టుకున్నారట.

అంతేకాదు సమంతకి అనాధ పిల్లలకి హెల్ప్ చేయడం అంటే మొదటి నుంచి ఇష్టం .. ఈ క్రమంలోనే నాగచైతన్య వందమంది అనాధ పిల్లలకు బట్టలు – ఫుడ్ పంపిణీ చేసినట్లు ఓ న్యుస్ వైరల్ అవుతుంది. అయితే ఈ విషయాన్ని అఫీషియల్ గా ఎక్కడ ప్రకటించిన నాగచైతన్య – సమంత పై ఇంకా ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్ . అంతే కాదు నిజమైన లవ్ అంటే ఇదే.. కలిసున్న విడిపోయిన ఆమెపై ఉన్న ప్రేమ ఎప్పటికీ తగ్గకుండా ..ఆమెకి ఇష్టమైన పనులు చేస్తూనే ఉండటమే అంటూ చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోని సోషల్ మీడియాలో నాగచైతన్యాన్ని పొగడెస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news