స్టార్ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం సినిమా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఆమె నటించిన యశోద అనే థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఇక శాకుంతలం దాదాపుగా రెండేళ్లుగా షూటింగ్ నడుస్తూనే ఉంది. రుద్రమదేవి సినిమా తర్వాత గుణశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఇది ఆయన సొంత బ్యానర్లోనే తెరకెక్కింది.
ఇక సమంత హీరోయిన్ కావడం.. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు సమర్పణలో ఈ సినిమా వస్తోంది. ఇక సెన్సార్ కంప్లీట్ చేసుకున్న శాకుంతలంకు సెన్సార్ వారు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమా రన్ టైం 142 నిమిషాలుగా ఉంది. ఇదొక్కటి ఈ సినిమాకు చాలా ప్లస్ అంటున్నారు.
అయితే సినిమా చూసిన ఇండస్ట్రీ జనాలు సినిమా అంత గొప్పగా లేదని పెదవి విరుస్తున్నారట. సినిమాకు ఇండస్ట్రీ జనాల నుంచి మిక్స్‌డ్ టాక్ అయితే వస్తోంది. సినిమా బాగుందంటున్నో వారు చాలా తక్కువ మంది ఉన్నారు. సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు ఇస్తున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. స్క్రీన్ ప్లే సరిగా లేదని.. ఇక గ్రాఫిక్స్ అయితే చాలా నాసిరకంగా.. పూర్‌గా ఉన్నాయని చెపుతున్నారు.
ఎన్నో క్లాసిక్ సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు తీసిన గుణశేఖర్ శాకుంతలం లాంటి హిస్టారికల్ సినిమాతో ఇంత డిజప్పాయింట్మెంట్ చేస్తాడని తాము ఊహించలేదంటున్న వారే ఎక్కువ మంది ఉంటున్నారు. మరి రేపు రిలీజ్ అయ్యాక ఏమైనా టాక్ మారుతుందా.. సమంత మ్యాజిక్ ఏమైనా పని చేస్తుందా ? అన్నది చూడాలి.
శాకుంతలం సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. గుణశేఖర్ కూతురు నీలిమ గుణ ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మించగా… ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, సచిన్ ఖేడేకర్, అదితి బాలన్, అనన్య నాగళ్ల, గౌతమి కీలక పాత్రల్లో నటించారు.