టాలీవుడ్ మాస్ మహారాజగా పేరు సంపాదించుకున్న రవితేజ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన రీసెంట్ సినిమా రావణాసుర . టైటిల్ తోనే సస్పెన్స్ ని క్రియేట్ చేసిన డైరెక్టర్ సినిమా లో అన్ని ఎలివేషన్స్ క్లియర్గా కొట్టినట్లు చూపించి ..సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకున్నాడు. సుధీర్ వర్మ తెర కెక్కించిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది .
రావణాసుర సినిమాకి రవితేజ చాలా కష్టపడ్డాడు . సినిమా షూటింగ్ టైం లో ఆరోగ్యం బాగోలేకపోయినా షూట్ కంప్లీట్ చేసాడు. ఆయన కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. ఈ క్రమంలోనే రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమాలో రవితేజ నటించిన రావణాసుర సినిమాలో డైలాగులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సెకండ్ సస్పెన్స్ తో క్రియేట్ చేసిన సుధీర్ వర్మ.. నెగిటివ్ మార్కింగ్ అనేది లేకుండా రావణాసుర సినిమాను తెరకెక్కించాడు .
పూర్తి సస్పెన్స్ క్రైమ్ ధిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో దక్ష నగార్కర్, మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ లాంటి కూర హీరోయిన్లు నటిస్తున్నారు. హీరో సుశాంత్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. మరి ముఖ్యంగా రవితేజ ఈ సినిమాలో చాలా బోల్డ్ డైలాగ్స్ చెప్పి జనాలకు షాక్ ఇచ్చాడు. లాయర్ పాత్రలో ఒక్కోక్కడికి దూల తీర్చేసాడు. ఇలాంటి ఫుల్ మీల్స్ పెట్టాక రవితేజ ఫాన్స్ కామ్ గా ఉంటారా..? థియేటర్స్ వద్ద రచ్చ రచ్చ చేస్తున్నారు ..నానా హంగామా చేస్తున్నారు . మొత్తంగా చూస్తుంటే రవితేజ హ్యాట్రిక్ కొట్టాడని చెప్పాలి . చూడాలి మరి రవితేజ రావణాసుర ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో..?