టాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత మెగా ఫోన్ పట్టి డైరెక్టర్ గా తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్నాడు రాఘవ లారెన్స్. ఇప్పుడు రాఘవ లారెన్స్ సౌత్ ఇండియాలోనే ఫేమస్ డైరెక్టర్ అయిపోయాడు. నాగార్జున లాంటి స్టార్ హీరో తో రెండు సినిమాలు చేసి రెండు సూపర్ డూపర్ హిట్లు కొట్టాడు. డాన్, మాస్ రెండు హిట్లు లారెన్స్ ఇచ్చినవే. ఇక కాంచన సిరీస్ సినిమాలతో లారెన్స్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.
తాజాగా లారెన్స్ హీరోగా నటించిన సినిమా రుద్రుడు. ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషలలో రిలీజ్ అవుతుంది. నిర్మాత కదిరేశన్ తన సొంత బ్యానర్ పై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కు మద్రాస్ హైకోర్టు బ్రేక్ వేసింది. దీంతో రేపు రుద్రుడు సినిమా రిలీజ్ అవుతుందా లేదా ? అన్న సందేహాలు నెలకొన్నాయి.
హిందీతో పాటు ఉత్తరాది పంపిణీ హక్కులను రెవెన్సా అనే కంపెనీ దక్కించచుకుంది. ఈ క్రమంలోనే సదరు సంస్థ రూ.12.25 కోట్లతో ఒప్పందం కూడా కుదుర్చుకోవడంతో పాటు రూ.10 కోట్లను అడ్వాన్స్‌గా చెల్లించింది. అయితే ఇప్పుడు నిర్మాత మరో రు 4.25 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో రెవెన్సా సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు ఈ నెల 24వరకు ఈ సినిమాను రిలీజ్ చేయవద్దని ఆదేశాలు జారీచేసింది. దీంతో తమిళ ఉగాది రేస్ నుంచి రుద్రన్ తప్పుకున్నాడు. ఈ సినిమా రిలీజ్‌కు ఇంకొన్ని గంటలు మాత్రమే సమయం ఉండడంతో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. దీంతో రేపు ఉదయం షోలు పడే వరకు రుద్రుడు రిలీజ్ ఉంటుందా ? లేదా ? అన్నది తెలియట్లేదు.