నటీనటులు: విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ, ప్రభు, ఆర్. శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరామ్, ప్రకాష్ రాజ్, ఆర్. పార్తిబన్
నిర్మాతలు: మణిరత్నం, సుభాస్కరన్ అల్లి రాజా
దర్శకత్వం : మణిరత్నం
సినిమాటోగ్రఫీ: రవి వర్మన్
ఎడిటింగ్: ఎ. శ్రీకర్ ప్రసాద్
మ్యూజిక్: ఏ. ఆర్. రెహమాన్
రిలీజ్ డేట్: 28 ఏప్రిల్, 2023
పొన్నియిన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకులకి చోళ రాజ వంశం గురించి పరిచయం చేసిన స్టార్ డైరెక్టర్ మణిరత్నం సంచలన విజయం నమోదు చేశాడు. నిజంగా పీఎస్ 1 సినిమా తమిళ ప్రేక్షకులకు పాత మణిరత్నాన్ని కం బ్యాక్ అన్నట్టుగా హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు ఆ సినిమాకు కంటిన్యూగా వచ్చిన పీఎస్ 2 సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నేడు థియేటర్ల లో విడుదల అయ్యింది. మరి మణిరత్నం మ్యాజిక్ ఈ సినిమా కంటిన్యూ చేసిందో లేదో TL సమీక్షలో చూద్దాం.
స్టోరీ :
ఆదిత్య కరికాలన్ ( విక్రమ్ ), నందిని ( ఐశ్వర్యరాయ్ ) తొలిప్రేమ సన్నివేశాలతో ఈ సినిమా ప్రారంభమవుతుంది. వారు విడిపోయిన తీరు చాలా మిస్టరీగా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో పార్ట్ వన్ వివరించటం జరుగుతుంది. చోళ రాజ్య సింహాసనం కోసం నందిని ( ఐశ్వర్యారాయ్ ) ఎలాంటి రాజకీయాలు చేస్తుంది. చోళ రాజ వంశానికి చెందిన సుందర చోళన్ ( ప్రకాష్ రాజ్ ) పొన్నియన్ సెల్వన్, అరుణ్ మౌళి అయిన ( జయం రవి ) ఆదిత్య కరికాలన్ ( విక్రం ) లను చంపేందుకు ప్లాన్ వేసింది ఎవరు ? పొన్నియన్ సెల్వన్‌ను కాపాడిన ఆ మరొక ఐశ్వర్యారాయ్ ఎవరు ? చోళులు మళ్ళీ శత్రువులపై విజయం సాధించారా ? కరికాలన్ ( విక్రమ్ ) తన ప్రేమ కోసం ఏం చేశాడు ? నందిని ( ఐశ్వర్యారాయ్ ) తన పగను సాధించిందా లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ పొన్నియన్ సెల్వన్ 2 సినిమా.
విశ్లేషణ :
పిఎస్ 1 మొదటి భాగంలో సస్పెన్స్ గా ఉన్న కొన్ని ప్రశ్నలకు మణిరత్నం కాస్త విపులంగా నేరేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిజజీవితంలో ఇంత పెద్ద చరిత్రను రెండు భాగాలుగా మలిచి తనదైన టేకింగ్ తో తొలి భాగం కంటే కాస్త వివరంగా అర్థవంతంగా రెండో భాగాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నించారు. ఈ సినిమాలో కూడా ఇంట్రెస్టింగ్ గా మంచి స్క్రీన్ స్పేస్ దక్కించుకున్న కార్తీ, విక్రమ్, ఐశ్వర్యరాయ్ పాత్రలు బాగా పేలాయి. సినిమాలో ప్రధానంగా విక్రమ్ – ఐశ్వర్యారాయ్ ట్రాక్‌పై ఎంతో ఆసక్తి నెలకొంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తిగా ఉన్నాయి.
అలాగే వీటికి రిలేటెడ్ గా చాలా సన్నివేశాలు ఉన్నాయి. దర్శకుడు వీటిని హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. ఇక ఐశ్వర్యరాయ్ రెండు షేడ్స్ లో చేసిన నటన అద్భుతంగా ఉంది. మిగిలిన నటీనటులు నటన కూడా బాగుంది. రాజకీయాలు, కుట్రలు, ఎత్తులు ఆసక్తిని కలిగిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు బాగున్నాయి. ఈ తరహా భారీ పిరియాడిక్ సినిమాలకు విజువల్స్ చాలా ముఖ్యం. పార్ట్ వన్ తో పోలిస్తే పార్ట్ 2 లో విజువల్స్ చాలా బాగున్నాయి.
ఇక సినిమాటోగ్రఫీ అందించిన రవి వర్మన్‌కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పొచ్చు. ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలో సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. పొన్నియన్ సెల్వన్ పార్ట్ వన్ చూసి సంతృప్తి చెందిన ప్రేక్షకులకు రెండో భాగం కూడా అంతకన్నా బాగా నచ్చుతుంది. అది నచ్చని వాళ్లకు ఈ పార్ట్ 2 కూడా పెద్ద పరీక్ష అవుతుంది. అయితే తొలి భాగంలో జవాబు లేని ప్రశ్నలకు ఇందులో కొంతమేర సమాధానాలు లభిస్తాయి.
అయితే కథను నెరేట్ చేసే విషయంలో మణిరత్నం కొన్నిచోట్ల గందరగోళ్ల శైలిని కొనసాగించడంతో రెండో భాగం ముగిశాక కూడా అసలు ఈ సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నారని ? ప్రశ్న తలెత్తుతుంది. ఈ సినిమా కథ చదివిన వాళ్లు పక్కనే కూర్చుని.. ప్రతి ఎపిసోడ్ తర్వాత వివరణ ఇస్తూ ఉంటే ఈ సినిమా బాగా అర్థమవుతుందేమో అనిపించేలా ఉంది. ఈ కథ గురించి పూర్తిగా తెలిసిన వాళ్లకు అయితే ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది.
ఎంత కాదనుకున్న ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలు చూస్తున్నప్పుడు రాజమౌళి తీసిన బాహుబలి గుర్తుకు రావటం సహజం. అందులో పాత్రలను ఎలివేట్ చేసిన విధానం.. ఎలాంటి ?గందరగోళం లేకుండా కథను నెరేట్ చేసిన తీరు కథనంలోని బిగి, భావోద్వేగలను పతాక స్థాయికి తీసుకు వెళ్లిన తీరు.. యాక్షన్ ఘట్టాలు వాటితో పోల్చుకుని చూస్తే పొన్నియన్ సెల్వన్ 2 రుచించడం కష్టం.
అయితే రాజమౌళితో పోలిస్తే మణిరత్నం శైలి వేరేగా ఉంటుంది. ఇక టెక్నికల్ గా చూస్తే రవి వర్మ విజువల్స్ – ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం – అద్భుతమైన ఆర్ట్ వర్క్ ఇలాంటి టెక్నికల్ ఆకర్షణలతో ఈ సినిమా మరో మెట్టు పైనే ఉంటుంది. ఆఖరిలో వచ్చే యుద్ధ సన్నివేశాలు మెరుగ్గా ఉంటాయి. ఇక సినిమా కొంత లెన్దీగా ఉన్న చాలా ఎపిసోడ్లు బాగున్నట్టు ఉంటాయి. జయమోహన్ స్క్రీన్ ప్లే కాస్త కన్‌ఫ్యూజ్‌గానే ఉంటుంది. దర్శకుడిగా మణిరత్నం మాత్రం మళ్లీ నిరాశ పరిచాడు. సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా కథను చెప్పలేకపోయాడు.
నటీనటుల పెర్పామెన్స్ :
ఫార్ట్ 1తో పోలిస్తే జయం రవి హైలైట్ అయ్యాడు. తన లుక్.. స్క్రీన్ ప్రెజెన్స్ చక్కగా ఉన్నాయి. విక్రమ్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఐశ్వర్యా రాయ్ నటన ఓకే కానీ.. వయసు ప్రభావం కనిపించేస్తోంది.
ఆమె ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నాయి. ఇక త్రిష చాలా అందంగా.. ఆకర్షణీయంగా ఉంటే… కార్తీ తన చలాకీ నటనను కొనసాగించాడు. ప్రకాష్ రాజ్.. శరత్ కుమార్, మిగిలిన నటులకు తక్కువ స్క్రీన్ స్పేస్ దొరికినా వారి పాత్రలకు న్యాయం చేశారు.
ఫైనల్‌గా…
పొన్నియన్ సెల్వన్ 1కు డీసెంట్‌గా వచ్చిన సినిమానే పీఎస్ 2. ఈ వారాంతంలో ఓ డీసెంట్ పిరియాడికల్ డ్రామా చూడాలనుకుంటే చూడొచ్చు.
పొన్నియన్ సెల్వన్ రేటింగ్: 2.5 / 5