ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్‌కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా స్టార్ హీరోల అభిమానులు తమ హీరోల పాత సినిమాలను మళ్లీ థియేటర్స్ లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. పైగా రీ రిలీజ్ లోను చాలా సినిమాలు రికార్డులతో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్‌గా రాంచరణ్ నటించిన ఫ్లాప్ సినిమా ఆరెంజ్ కు మూడు రోజుల్లో ఏకంగా మూడు కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి.
అదే బన్నీ నటించిన దేశముదురు సినిమాకు అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. ఇక ఆరెంజ్ సినిమా తొలి రోజు ఏకంగా కోటికి పైగా గ్రాస్ వసూలు చేసింది. మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా ఉంది. ఈ సినిమా ఫస్ట్ డే ఏకంగా రు. 3.62 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత ప్లేస్‌లో పవన్ సినిమా జల్సా ఉంది. జల్సా సినిమా 2.57 కోట్ల కలెక్షన్ రాబట్టింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కడు మూవీ 1.90 కోట్ల గ్రాస్ వసూళ్లతో థర్డ్ ప్లేస్‌లో ఉంది. అల్లు అర్జున్ దేశ ముదురు కూడా 1.54 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి నాలుగో ప్లేస్‌లో ఉన్నా ఈ సినిమాపై ఉన్న హైప్‌తో పోలిస్తే అనుకున్న వసూళ్లు రాలేదు. ఇక పోకిరికి అయితే ఫస్ట్ డే ఏకంగా 1.52 కోట్ల గ్రాస్, రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాకు రు. 1.42 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ రీ రిలీజ్ ట్రెండ్‌లో ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ సింహాద్రిని రిలీజ్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మే 20న సింహాద్రి రీ రిలీజ్ అవుతోంది. అయితే ఈ సినిమాతో ఖుషి కలెక్షన్స్ ఫస్ట్ డే టార్గెట్ అందుకోవాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. మరి నందమూరి అభిమానులు సింహాద్రి రీ రిలీజ్‌తో జూనియర్ ఎన్టీఆర్‌కు ఏ స్థాయిలో కలెక్షన్లు ఇస్తారో ? చూడాలి.