సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ చేయలేరు . స్టార్ గా ఉన్న హీరో అవ్వడం జీరో గా ఉన్న హీరో స్టార్ గా మారడం రాత్రి జరిగిపోతూ ఉంటాయి . అలాంటి మాయలకు బలైపోయిన హీరో హీరోయిన్లు ఎంతోమంది . కాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోతుంది గాయత్రి రావు . ఇలా చెప్తే జనాలు గుర్తుపట్టడం కష్టమే ..కానీ హ్యాపీడేస్ సినిమాలో అప్పు పాత్రలో నటించిన అమ్మాయి అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు .
ఆ తరువాత హరి శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాలో హారతి అనే పాత్రలు నటించి మెప్పించింది. అయితే గాయత్రి రావుకు పాపులారిటీ తీసుకొచ్చిన సినిమా మాత్రం హ్యాపీ డేస్ అని చెప్పాలి . శేఖర్ మూల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫీల్ గుడ్ సినిమాలో అపర్ణ వన్ ఆఫ్ ద ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించింది. కాగా ఈ సినిమా 2007లో రిలీజ్ అయ్యి సినీ ఇండస్ట్రీలు లెక్కలను తిరగరాసింది .
అప్పట్లో ఎన్నో అవార్డును కొల్లగొట్టిన ఈ సినిమాలో నటించిన చాలామంది స్టార్స్ ఇప్పుడు సెలబ్రిటీలుగా మారిపోయారు . ఇదే క్రమంలో కొందరు అడ్రస్ లేకుండా గల్లంతయ్యారు . వాళ్ళల్లో ఒకరే గాయత్రి రావు. ఈ సినిమా తర్వాత గాయత్రి రావు పలు సినిమాల్లో కనిపించింది . అయినా పెద్దగా పాపులర్ దక్కించుకోలేకపోయింది .
ఈ క్రమంలోనే వివాహం చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది గాయత్రి రావు . ప్రజెంట్ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది . బాగా బొద్దుగా తయారైపోయి అస్సలు గుర్తుపట్టలేని స్థితికి మారిపోయింది . అంతేకాదు ఎవరికి తెలియని విషయం ఏంటంటే గాయత్రి తల్లి కూడా ఒక నటినే . ఆమె పేరు పద్మ . క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా ఏళ్ల నుంచి టాలీవుడ్ లో కొనసాగుతూనే ఉంది . ప్రస్తుతం సీరియల్స్ లో మోస్ట్ బిజియస్ట్ ఆర్టిస్ట్ గా కొనసాగుతుంది..!!