పాపం ఈ మధ్యకాలంలో త్రిష టైం అస్సలు బాగోలేనట్టు ఉంది . అందుకే ఏ పని చేసిన సరే సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుంది . మరీ ముఖ్యంగా త్రిష రీసెంట్ గా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . మనకు తెలిసిందే రీసెంట్ గానే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష పోనియన్ సెల్వన్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది .
ఈ సినిమా తర్వాత బోలెడు సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. ఆచితూచి ఆలోచించి నిర్ణయించుకొని కథలను చూస్ చేసుకుంటుంది త్రిష . రీసెంట్గా పోనియన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది . హైదరాబాదులో గ్రాండ్ గా జరిగిన ఈ ప్రమోషన్స్ లో త్రిష బ్లాక్ శారీ తో హాట్ గా కనిపించింది.. ఎంతలా అంటే అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యారాయ్ పక్కన ఉన్న సరే అందరి కళ్ళు త్రిష పైనే పడ్డాయి ..
అంతలా తన చూపులతో అట్రాక్ట్ చేసింది . అయితే ఈ క్రమంలోని స్టేజ్ ఎక్కి మాట్లాడిన త్రిష తెలుగుకి తెగులు పట్టించింది అంటున్నారు జనాలు . సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్న తెలుగులో ఇన్ని సినిమాలు చేసిన ఇంకా తెలుగు నేర్చుకోలేదా ..? అసలు నీకు బ్రెయిన్ లేదు త్రిష..అంటుంటే .. మరికొందరు ఇంకా నువ్వు తెలుగు నేర్చుకోలేదా త్రిష అంటూ కొందరు ఘాటుగా స్పందిస్తున్నారు . అంతేకాదు ఈ క్రమంలోనే త్రిష డేటింగ్- ప్రేమ – పెళ్లి క్యాన్సిల్ విషయాలను కూడా తెరపైకి తీసుకొస్తూ జనాలు హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. దీంతో తెలిసి తెలియక చేసిన తనంతో త్రిష మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి..!!