నేచురల్ స్టార్ నాని నటించిన పాన్ ఇండియా సినిమా దసరా బాక్సాఫీస్ దగ్గర ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. శ్రీరామనవమి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దసరా సినిమాకు తొలి రోజు.. తొలి షో నుంచే అదిరిపోయే టాక్ వచ్చింది. ఇటీవల కాలంలో నాని నటించిన ఏ సినిమాకు రానంత అప్లాజ్ దసరా సినిమాకు వచ్చింది. రు. 70 కోట్ల భారీ బడ్జెట్ తో నాని కెరీర్ లోనే తొలిసారి పాన్ ఇండియా సినిమాగా వచ్చిన దసరా అదిరిపోయే టాక్ తెచ్చుకుంది.
నైజాం, సీడెడ్, ఆంధ్ర, కర్ణాటక ,ఓవర్సీస్ అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా దసరా వసూళ్లతో దుమ్ము రేపుతుంది. ఓవర్సీస్ లో తొలిరోజే ఏకంగా 8 లక్షల 50 వేల డాలర్ల వసూళ్లు కొల్లగొట్టిన దసరా రెండో రోజుకే 1.20 మిలియన్ డాలర్లతో మరింత స్ట్రాంగ్ గా పికప్ అయ్యింది. ఇక నైజాంలో కేవలం రెండు రోజులకే రు. 10 కోట్ల షేర్ మార్కెట్ దాటేసింది. ఇక రెండు రోజులకు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రు. 53 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఇక నాని కెరీర్లోనే కేవలం రెండు రోజుల్లోనే రు. 50 కోట్ల గ్రాస్ మార్క్ టచ్ చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కేసింది. అసలు ఈ దూకుడు చూస్తుంటే ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యే సరికే రు. 100 కోట్ల గ్రాస్ వసూళ్లు దాటేస్తుందనే అంటున్నారు. ఇక నార్త్‌లో కూడా ఈ సినిమా రెండో రోజు బాగా ఫికప్ అయ్యింది. ఈ దూకుడు చూస్తుంటే దసరా క్రియేట్ చేసే సంచలనాలు చాలానే ఉండబోతున్నాయి.