Moviesపుష్ప 2 పై బాలయ్య రియాక్షన్.. నందమూరి బిడ్డ అంటే ఆ...

పుష్ప 2 పై బాలయ్య రియాక్షన్.. నందమూరి బిడ్డ అంటే ఆ మాత్రం ఉండాల్సిందేగా..!!

సినిమా ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీకి – నందమూరి ఫ్యామిలీకి మధ్య ఉన్న ప్రత్యేక బంధం గురించి సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నా.. ఎన్ని కుటుంబాలు ఫ్రెండ్షిప్ చేస్తున్నా.. వీళ్లిద్దరి కుటుంబం మధ్య ఉన్న స్నేహబంధం వేరనే చెప్పాలి . రీసెంట్ గానే అల్లు ఫామ్ కి సంబంధించిన ఆహా ఓటీటీ లో బాలయ్య ఏకంగా హోస్ట్ గా అవతారం ఎత్తారు . అన్ స్టాపబుల్ షో తో సినిమా ఇండస్ట్రీ లెక్కలను మార్చేశాడు బాలయ్య .

ఎలాంటి క్రెజ్ సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బాలయ్య కారణంగా ఆహా ఓటిటి ఏ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే . అంతే కాదు అల్లు అర్జున్ బాలయ్య మధ్యలో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది . అయితే ఆ విషయాన్ని ఎప్పుడు కూడా బయటకు చూపించరు వీరిద్దరూ . కాగా ఇప్పుడు కూడా అలాగే బాలయ్య తన బ్లెస్సింగ్స్ ని తన ఇష్టాన్ని అల్లు అర్జున్ కు పర్సనల్గా మెసేజ్ చేసినట్లు ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది .

ఈరోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు. సోషల్ మీడియా వ్యాప్తంగా అల్లు అర్జున్ కి బర్తడే విషేష్ అందజేస్తున్నారు అల్లు అభిమానులు . ఈ క్రమంలోనే బన్నీకి బర్త్డే విషెస్ తో పాటు పుష్ప 2 టీజర్ కి సంబంధించిన రివ్యూ కూడా బాలయ్య అల్లు అర్జున్ కి ఇచ్చేసినట్లు తెలుస్తుంది. టీజర్ చూసిన బాలయ్య అల్లు అర్జున్ ని ఓ రేంజ్ లో పొగిడేసారట. “మాస్ యాంగిల్ లో నటించడం చాలా కష్టమని .. ఆ రోల్ కి నువ్వే సరైన వాడివని ఓ రేంజ్ లో పొగిడేసారట . అంతేకాదు తనదైన స్టైల్ లో బ్లెస్సింగ్స్ ఇస్తూ పుష్ప2 నే కాదు పుష్ప3 కూడా రావాలి అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తూ పాన్ ఇండియా నే కాదు.. గ్లోబల్ స్థాయికి ఎదగాలి అని బ్లెస్ చేశారట . ఈ క్రమంలోనే నందమూరి అభిమానులు ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news