ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పొజిషన్ నెలకొందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కోట్లు ఖర్చు చేసి తీస్తున్న పాన్ ఇండియా సినిమాలు కూడా తుస్సుమంటూ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవుతున్నాయి. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన సినిమాలు కోట్లకు కోట్లు రిలీజ్ చేసి కోట్లకు కోట్లు లాభాలు తెచ్చిపెట్టి సెన్సేషనల్ హిట్టుగా మారుతున్నాయి . వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . రీసెంట్గా రిలీజ్ అయిన బలగం సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు .
పట్టుమంటే పది కోట్లు కూడా పెట్టని ఈ సినిమాకి హ్యూజ్ ప్రాఫిట్స్ రావడం సినిమాకి హైలెట్గా మారింది . మరీ ముఖ్యంగా ఎటువంటి హంగామా ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా తెరకెక్కిన ఈ సినిమా ఇంతటి స్థాయిలో విజయం అందుకోవడానికి మెయిన్ రీజన్ కధా.. కంటెంట్ బలమే అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. కాగా అలాంటి సినిమాలను చూస్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు మెగాస్టార్ చిరంజీవి . ఈ క్రమంలోనే స్టార్ట్ డైరెక్టర్ కాదు నిన్నకాకమొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన డైరెక్టర్ సైతం అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు .
ఈ క్రమంలోనే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని డైరెక్టర్ తో సినిమా కమిట్ అయ్యాడు మెగాస్టార్ చిరంజీవి అంటూ సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .మల్లాది వశిష్ట తో మెగాస్టార్ చిరంజీవి క్రేజీ కాంబోని ఫిక్స్ చేసినట్లు వైరల్ అవుతుంది . ఈ క్రమంలోనే అలాంటి హిట్ కొట్టిన ఈ హీరో మంచి నేటివిటీ కంటెంట్ ఉన్న సినిమాను కథను చిరంజీవికి వివరించారట . కధ వినగానే ఫిదా అయిపోయిన చిరంజీవి ఆలస్యం లేకుండా సినిమాకి సైన్ చేసినట్టు తెలుస్తుంది .
అంతేకాదు త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుంది. ఒకవేళ నిజంగా అది నిజమైతే మాత్రం మెగాస్టార్ మరో సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు ఇండస్ట్రీలో అంటున్నారు మెగా ఫాన్స్ . కచ్చితంగా టాలెంట్ ఉంటే అవకాశం ఇవ్వడానికి చిరంజీవి వెనకడుగు వేయడు అన్న మాటలకు ప్రత్యేక ఉదాహరణగా నిలిచారు. ఏది ఏమైనా సరే ఇండస్ట్రీలో చిరంజీవి లాంటి హీరోలుఉండాలి ఉండి తీరాలి అన్నది మాత్రం వాస్తవం అంటున్నారు ఫ్యాన్స్..!!