Moviesమౌనిక‌తో త‌న ప్రేమ ఎలా చిగురించిందో చెప్పిన మ‌నోజ్‌… క్యూట్ ల‌వ్...

మౌనిక‌తో త‌న ప్రేమ ఎలా చిగురించిందో చెప్పిన మ‌నోజ్‌… క్యూట్ ల‌వ్ స్టోరీ..!

టాలీవుడ్ హీరో మంచు మోహన్ బాబు రెండో కుమారుడు మనోజ్ రెండో పెళ్లి చేసుకుని జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మౌనికను పెళ్లాడి ఆమెతో కొత్త జీవితం ప్రారంభించాడు. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. మనోజ్ కు ముందు ప్రణతి రెడ్డితో వివాహం జరిగింది. అలాగే మౌనిక రెడ్డికి తిరుపతికి చెందిన గణేష్ రెడ్డితో పెళ్లి జరిగింది. వీరిద్దరూ తమ భాగస్వాములతో విడిపోయి విడాకులు తీసుకున్నారు. అప్పటికే వీరి మధ్య ఉన్న పాతస్నేహం కొత్తగా చిగురించి ప్రేమగా మారింది. దాన్ని అలా పెళ్లితో పదిల పరుచుకున్నారు

మార్చి 3 న మంచు లక్ష్మి నివాసంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. తాజాగా ఈ కొత్తజంట ఒక షోలో పాల్గొని తమ ప్రేమ కహాని బయటపెట్టింది. ముందు మనోజ్ మాట్లాడుతూ మా ఇద్దరిలోను తానే ఎక్కువ రొమాంటిక్ అని చెప్పాడు. మౌనిక మాట్లాడుతూ అమ్మ చనిపోయాక ఆ జయంతి రోజు తాను ఆకాశం వైపు చూస్తూ ఎక్కడున్నావమ్మా ? నాకు ఏం కావాలో నీకు తెలుసు ? అంతా నీకే వదిలేస్తున్నాను అని నాలో నేను మాట్లాడుకున్నాను.. ఆ సమయంలో తాను ఎంతో బాధతో ఉన్నానని.. ఆరోజు మనోజ్ ఆళ్లగడ్డకు రాడేమో అనుకున్నానని.. ఆ రోజు నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని మౌనిక తెలిపింది.

ఇక పెళ్ళికి ముందు మనోజ్ కోపాన్ని ఎలా ? డీల్ చేస్తానో అనుకున్న.. అయితే మనోజే ఇప్పుడు నాకు కోపంతో డీల్ చేస్తున్నాడు అని చెప్పుకొచ్చింది మౌనిక. ఇక తమ ప్రేమ ప్రయాణంలో ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి కూడా మనోజ్ తెలిపాడు. ప్రేమ అనేది రెండు పక్కల ఉండాలి.. ఒక సమయంలో తాను ఎక్కడ ఉన్నాను ? ఎటువైపు వెళుతున్నాను అనేది అర్థం కాలేదు. అప్పుడు ప్రేమా, సినిమాయా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నాడు.

కానీ నన్ను నమ్ముకుని ఒక బిడ్డతో ఆ అమ్మాయి నిలబడి ఉంది. తనకు ద్రోహం చేస్తే ఈ జన్మకు తాను బతికి వేస్ట్ అనుకున్నాను అని చెప్పుకొచ్చాడు. అలా మౌనికని పెళ్లాడి ఆమె కొడుకు బాధ్యత సైతం తానే స్వీకరించాడు ఈ విషయాన్ని మనోజ్ ఇప్పటికే చాలాసార్లు ఓపెన్ గా చెప్పాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news