టాలీవుడ్ సర్కిల్స్‌లో ఇప్పుడు ఇదే విషయం బాగా వైరల్ అవుతుంది. సమంత అంటే నిన్న మొన్నటి వరకు ఒక స్టార్ హీరోయిన్. సమంతకు తిరుగులేని క్రేజ్ ఉండేది. సమంతకు మిలియన్ల కొద్ది ఫాలోవర్లు ఉండేవాళ్లు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా సమంత ఏమాత్రం తగ్గలేదు. ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. సమంత మయోసైటిస్ వ్యాధికి గురైన ఆమె దాని నుంచి కోలుకునేందుకు ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. దీనికి తోడు గతంలో కూడా సమంతకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి. సమంతకు గతం నుంచి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న వార్తలు తెలిసిందే
విడాకుల తర్వాత కూడా సమంతకు సినిమాలపరంగా అవకాశాలు వచ్చాయి. అయితే ఆమె తన వయసు రీత్యా ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలి అన్న విషయంలో పూర్తిగా రాంగ్ స్టెప్ వేసింది. విడాకులు తీసుకున్న వెంటనే అల్లు అర్జున్ పుష్ప సినిమాలో చేసిన ఐటెం సాంగ్ రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసింది. ఆ తర్వాత యశోద సినిమా రిలీజ్ కి ముందు సింపతి గేమ్ ఆడిందన్న విమర్శలు మూటగట్టుకుంది.
ఇప్పుడు శాకుంతలం సినిమా రిలీజ్ కు ముందు కూడా ప్రమోషన్లలో.. చివరకు తన వ్యక్తిగత విషయాలు కూడా బయటపెట్టి చీఫ్ ట్రిక్స్ ప్లే చేసిందన్న విమర్శలు తీవ్రంగా వచ్చాయి. సమంత అంటే ఒక స్టార్ హీరోయిన్.. ఆమె రేంజ్ వేరు. అలాంటి సమంత ఇప్పుడు ఎవరికీ ? తెలియని ఓ ఫేడవుట్ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు చేసిన కామెంట్లకు స్పందించి సోషల్ మీడియాలో కౌంటర్లు ఇవ్వడం ఆమె అభిమానులకి నచ్చటం లేదు.
ఇలా కౌంటర్లు ఇచ్చుకుంటూ పోవాలంటే ఆమె ఎంతో మందికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆమె వ్యక్తిగత జీవితంపై కూడా ఎన్నో విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా సమంత హీరోయిన్ రేంజ్ నుంచి రోజురోజుకు దిగజారి పోతుందన్న విమర్శలు వస్తున్నాయి. చిట్టిబాబు కూడా ఆ తరహా విమర్శలు ఆమెపై చేశారు. అయితే సమంత చిట్టిబాబును టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా కూడా కౌంటర్లు ఇవ్వడం నిజంగా ఆమె స్థాయితో పోలిస్తే చాలా తక్కువగా ఆమె బిహేవియర్ ఉందనే అంటున్నారు.
ఇక సమంత ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ లోను నటిస్తోంది. ఆ వెబ్ సిరీస్ లో ఆమె మరింత హాట్‌గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఆ వెబ్ సిరీస్ బయటకు వస్తే సమంత ఇంకేస్థాయిలో రెచ్చిపోయి దిగజారుతుందో అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.