సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ పొజిషన్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఏ సినిమా ఎప్పుడు హీట్ అవుతుందో ఏ సినిమా ఎప్పుడు ఫట్ అవుతుందో ఎవ్వరు చెప్పలేకపోతున్నారు . మరీ ముఖ్యంగా కోట్లకు కోట్లు పెట్టిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బురిడీ కొడుతూ ఉండడం స్టార్ హీరోస్ కి మింగుడు పడిన విషయం గా మారిపోయింది . ఈ క్రమంలోనే పాత డైరెక్టర్స్ లో పస తగ్గిందని కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి రావాలని జనాలు కోరుకుంటున్నారు . అలాంటి జనాలకు నితిన్ గుడ్ న్యూస్ వినిపించాడు.
టాలీవుడ్ యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న హీరో నితిన్ .. సమంత ఫ్రెండ్ నీరజకోన తో సినిమా చేయబోతున్నాడు అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. నీరజ కోన ఇండస్ట్రీలోకి డైరెక్టర్గా రాబోతున్నారు అంటూ ఓ ట్విట్ చేశారు . ఈ క్రమంలోనే ఆయన ట్విట్టర్ ఖాతాలో ఈ న్యూస్ షేర్ చేస్తూ అభిమానులకి కూడా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు. నీరజ కోన ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు .తెర పై కనిపించింది చాలా తక్కువ అయినా.. తెర వెనక ఎక్కువ పాత్ర పోషించింది .
2013లో ఎన్టీఆర్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిన బాద్ షా సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసి ఎంట్రీ ఇచ్చింది . ఈ క్రమంలోని ఆ తర్వాత సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా చేసి తనదైన స్టైల్ లో అలరించింది. మరి ముఖ్యంగా సమంత కి నీరజ కోన చాలా డ్రెస్ లు డిజైన్ చేసింది. ఇప్పుడు మంచి స్నేహితురాలుగా మారిపోయింది.
కేవలం కాస్టూయ్మ్ డిజైనర్ కాదు ..స్క్రిప్ట్ లోను సలహాలు ఇస్తుంది . మ్యూజిక్ పరంగా మంచి టాలెంట్ ఉంది. ఇలా ఆల్ రౌండర్ గా మారిన నీరజ త్వరలోనే డైరెక్టర్గా ఎంట్రీ ఇవ్వబోతుందట . ఇదే విషయాన్ని నితిన్ ట్వీట్ చేశాడు. దీంతో త్వరలోనే సమంతతో కూడా నీరజా సినిమా చేస్తుంది అంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు . అంతేకాదు నితిన్ ఈ రేంజ్ లో పొగిడేసారు కాబట్టి ఖచ్చితంగా నీరజకోన డైరెక్షన్లో నితిన్ సినిమా ఉంటుంది అంటూ జనాలు అనుకుంటున్నారు . ఏది ఏమైనా సరే ఇండస్ట్రీలో లేడి డైరెక్టర్ లు ఎక్కువైపోతుండటంతో కూసింత అయోమయంలో పడిపోయారు స్టార్ డైరెక్టర్లు. ఇన్నాళ్ళు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసిన నీరజ తో ఇక పై డైరెక్షన్లో వర్క్ చేయబోతున్నాడు ..ఇలా కొత్త ప్రయాణం మొదలు కాబోతుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు..!! చూద్దాం మరి నీరజకోన ఏ స్టైల్ డైరెక్షన్ చేసి అభిమానులను మెప్పిస్తుందో..?