మనదేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడ అయినా సినీపరిశ్రమలో లైంగిక వేధింపులు అనేవి చాలా కామన్. ఇంకా చెప్పాలంటే అవి ఇప్పుడు మాత్రమే కాదు. కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఉన్నాయి. అయితే అప్పట్లో ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా లేదు. అంత మీడియా కూడా లేదు. అందుకే అవి చాలా వరకు మరుగున పడిపోయేవి. పైగా అప్పటి హీరోయిన్లు చాలా వరకు కాంప్రమైజ్ అయ్యి ఉండేవారు.
ఇలా రోడ్డెక్కి అల్లరి చేసేవాళ్లు కాదు. అయితే గత ఆరేడేళ్లుగా ఇండియన్ సినిమా పరిశ్రమలో లైంగీక వేధింపులు ఎదుర్కొన్న హీరోయిన్లు, ఇతర నటీమణులు అందరూ కూడా రోడ్డెక్కి నానా రచ్చ చేస్తున్నారు. మీడియాలోనో లేదా సోషల్ మీడియా వేదికగానో తాము ఎదుర్కొన్న లైంగీక వేధింపుల గురించి చెపుతున్నారు.
ఇటీవల చాలా మంది నటీమణులు, మోడల్స్ కూడా దర్శక, నిర్మాతలు, హీరోలు చివరకు మేనేజర్లపై కూడా లైంగీక వేధింపుల ఆరోపణలు చేస్తున్నారు. ఇక బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ఇప్పటికే చాలాసార్లు తాను లైంగీక వేధింపులు ఎదుర్కొన్నట్టు తెలిపింది. అసలు నార్త్‌లో కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని బాగా తలకెత్తుకుని మరీ వార్తల్లో నిలిచింది కంగనాయే అన్న విషయం తెలిసిందే.
తాజాగా ఆమె మరోసారి లైంగీక వేధింపుల గురించి చెప్పింది. తనను ఓ స్టార్ డైరెక్టర్ హోటల్ గదికి రమ్మని పిలిచాడని… గదిలోకి పదే పదే రావాలని బలవంతం చేయడంతో తాను అతడి వైపు చాలా కోపంగా చూడడంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడని కంగన తెలిపింది. కెరీర్ ప్రారంభంలో ఇలాంటి పరిస్థితులు తాను ఎన్నో ఎదుర్కొన్నానని కంగన వెల్లడించింది.