ఏ తీగ పూవును.. ఏ కొమ్మ చేసెను.. అంటూ పాట గుర్తుందిగా.. భగ్న ప్రేమికులు… నాటి తరం నుంచి నేటి తరం వరకు ఎంతో ఇష్టంగా హమ్ చేసుకునే పాట ఇది. తమిళ కథానాయిక సరిత- విశ్వనటుడు. కమల్ హాసన్‌లు కలిసి నటించిన సినిమా.. మరో చరిత్ర. భగ్న ప్రేమికుల మధ్య సాగే సన్నివేశాలను.. బాలచంద ర్.. అద్భుతంగా తెరకెక్కించారు. సినిమాలో ఎక్కడా బోర్ అనేది లేకుండా.. ప్రేమకు భాషా భేదాలు లేవని నిరూపించే ప్రయత్నం చేశారు.
అయితే.. ఈ సినిమా తర్వాత.. అనూహ్యంగా సరిత..కమల్ హాసన్ అనేక సినిమాల్లో నటించారు. అటు తమిళంలోనూ.. ఇటు తెలుగులోనూ..ఆ సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. దీంతో ఎక్కడ చూసినా కమల్ సరితలకు.. ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇదిలావుంటే, గ్యాసిప్ రాయుళ్లకు కొదవేముంది.. కమల్-సరితలు.. ప్రేమించుకుంటున్నారని.. వారి మధ్య ప్రేమాయణం సాగుతోందని రాసుకొచ్చారు.
అప్పట్లో సరిత-కమల్ హాసన్‌ల మధ్య లవ్ ఎఫైర్‌పై అనేక చర్చలు సాగుతుండేవి. అయితే.. దీనిపై ఎంత రగడ జరిగినా..వారు ఇద్దరూ కూడా పెద్దగా రియాక్ట్ అయ్యేవారు కాదు. దీనికికారణం.. కమల్ వ్యూహం అని అంటారు.మన గురించి ఎంత ఎక్కువగా మాట్టాడితే.. అంత ఎక్కువ మంచిది!
అనే టైపులో కమల్ వ్యవహారం ఉండేది. అందుకే ఆయన ఎక్కడా నోరు విప్పేవారు కాదు.
ఇక.. సరిత అప్పట్లో అంతా భిడియంగా ఉండేది. బాలచందర్ శిష్యురాలిగా ఆమె కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే.. బాలచందర్ కనుసన్నల్లోనే ఆమె అడుగులు వేశారు. ఇక బాలచందర్తోనూ ఆమెకు ఎఫైర్ ఉండేదనే అంటారు. అయితే బాలచందర్ ఈ ప్రేమను చాలా సైలెంట్‌గా కొనసాగించేవారని కూడా పుకార్లు ఉండేవి. అలా అప్పట్లో సరితకు అటు కమల్, ఇటు బాలచందర్ ఇద్దరితోనూ ప్రేమాయణాలు నడిచేవనే ఎక్కువ మంది చెపుతూ ఉండేవారు.