Moviesఇటు ప్రెగ్నెంట్‌… అటు విడాకులు… నిహారిక లైఫ్‌లో ఒకేసారి ఇన్ని షాకులా…!

ఇటు ప్రెగ్నెంట్‌… అటు విడాకులు… నిహారిక లైఫ్‌లో ఒకేసారి ఇన్ని షాకులా…!

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం గుంటూరు కు చెందిన మాజీ పోలీసు ఉన్నతాధికారి కుమారుడు జొన్నలగడ్డ చైతన్యతో ఆమె వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వివాహం జరిగాక నాలుగైదు సార్లు నిహారిక కాంట్రవర్సీతో వార్తల్లోకి ఎక్కారు. ఒకసారి తన భర్తతో ఆమె కలిసి ప్లాట్ లో ఉండగా పెద్ద గొడవ జరిగింది. ఆ త‌ర్వాత గతేడాది ఆమె జూబ్లిహిల్స్‌లోని ఓ ప‌బ్‌లో పోలీసుల రైడింగ్‌లో అడ్డంగా దొరికిపోయింది

దానికి క‌వ‌ర్ చేసేందుకు మెగాఫ్యామిలీ నానా తంటాలు ప‌డింది. ఇక గ‌త వారం ప‌దిరోజులుగా ఆమె త‌న భ‌ర్త చైత‌న్య‌తో దూరంగా ఉంటోంద‌ని.. వీరిద్ద‌రి మ‌ధ్య ఇప్ప‌టికే గ్యాప్ పెరిగిపోవ‌డంతో వీరు విడాకుల‌కు సిద్ధ‌మ‌వుతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. పైగా ఇద్ద‌రూ కూడా త‌మ సోష‌ల్ మీడియాలో ఒక‌రి ఫొటోలు మ‌రొక‌రు డిలీట్ చేయ‌డంతో పాటు ఒక‌రిని ఒక‌రు అన్‌ఫాలో చేసుకోవ‌డం కూడా ఈ విడాకుల వార్త‌ల‌కు మ‌రింత ఊతం ఇచ్చిన‌ట్ల‌య్యింది.

ఇదిలా ఉంటే తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటో ఇప్పుడు నెట్టింట్లో ర‌క‌ర‌కాల సందేహాల‌కు కార‌ణ‌మైంది. ఆమె ముక్కుకు ముక్కెర పెట్టుకుని పుల్ల మామిడికాయ తింటోన్న ఫొటో షేర్ చేసింది. మామిడికాయ తింటూ ర‌క‌రకాల ఎక్స్‌ప్రెష‌న్స్‌తో ఉన్న వీడియో షేర్ చేయ‌డంతో పాటు మామిడికాయ లేకుండా స‌మ్మ‌ర్ ఏంటి ? అని క్యాప్ష‌న్ పెట్టింది.

ఈ ఫొటోపై ఇప్పుడు ఇండ‌స్ట్రీలో నిహారిక మొత్తానికి ఏదో విశేషం చెప్ప‌బోతోంద‌ని చ‌ర్చించుకుంటున్నారు. ఆమె ప్రెగ్నెంటా ? అని కూడా కొంద‌రు డౌట్లు వ్య‌క్తం చేస్తున్నారు. ఓ వైపు విడాకుల వార్త‌లు.. భార్య‌భ‌ర్త‌లు ఇద్ద‌రూ దూరంగా ఉంటున్నారు. ఈ టైంలో ప్రెగ్నెంట్ వార్త‌లు ఏంటో ఎవ్వ‌రికి తెలియ‌ట్లేదు. ఏదేమైనా నిహారిక ఒకేసారి ఇన్నేసి షాకులు ఇస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news