మనిషి అన్న తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాట్లు ఉంటాయి . ఇష్టా ఇష్టాలు ఉంటాయి ..కోరికలు ఉంటాయి. వాటిని కొంతమంది పిచ్చి.. పైత్యం కూడా అంటూ ఉంటారు. ఎవరు ఏమనుకున్నా ప్రతి మనిషిలో ఆ పిచ్చి అనేది ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. కాగా కేవలం సామాన్య జనాలకే కాదు సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోస్ కి కూడా అలాంటి పిచ్చిలు ఉన్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ హీరోగా పేరు సంపాదించుకున్న వెంకటేష్ కి ఉన్న క్రేజీ పిచ్చి గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .
మనకు తెలిసిందే దృశ్యం సినిమాలో వెంకటేష్ సినిమా లవర్ గా కనిపిస్తాడు. ఏ సినిమా అయినా సరే చూడందే తనకి నిద్ర పట్టదు . అలాంటి ఓ క్యారెక్టర్ లో నటించాడు వెంకటేష్ . అయితే కేవలం అది సినిమా క్యారెక్టర్ విషయంలోనే కాదని.. నిజ జీవితంలో కూడా ఆ క్యారెక్టర్ అలాంటిది ..ఏంటో చెప్పుకొస్తున్నారు జనాలు . మరీ ముఖ్యంగా వెంకటేష్ కి సినిమాలు అంటే ఎక్కువగా పిచ్చి ఉందని ..
చిన్నప్పటినుంచి ఏ సినిమా రిలీజ్ అయిన ఖచ్చితంగా సినిమాను చూసే వరకు నిద్రపోడు అని ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. అంతేనా పెళ్లయిన కొత్తల్లో కూడా భార్యను రాత్రి పగలు తేడా లేకుండా అదే విధంగా సినిమాలు చూయించి చూయించి టార్చర్ చేసే వాడని.. ఆమెకి ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా వెంకటేష్ కోసం కూర్చుని ఆ సినిమా మొత్తం కంప్లీట్ అయ్యేవరకు చూసేదని.. ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. అంతేనా నిద్ర వస్తున్న సరే వెంకటేష్ తన భార్యను వదిలేవాడు కాదట.. కచ్చితంగా సినిమా చూడాల్సిందే అంటూ పట్టుబట్టి మరి ఆమెను ఆ విధంగా ప్రేమతో టార్చర్ చేసేవాడట..!!