Moviesఉపాస‌న బేబీష‌వ‌ర్ డ్రెస్సుల రేట్లు చూస్తే క‌ళ్లు చెదిరిపోతున్నాయ్‌..!

ఉపాస‌న బేబీష‌వ‌ర్ డ్రెస్సుల రేట్లు చూస్తే క‌ళ్లు చెదిరిపోతున్నాయ్‌..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని పెళ్లయిన ఇన్నేళ్లకు ఎట్టకేలకు ప్రెగ్నెంట్ అయ్యారు. త్వరలోనే ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. తన జీవితంలో ఇంత ఇంపార్టెంట్ విషయాన్ని ఉపాసన గత ఏడాది డిసెంబర్లో ప్రకటించారు. అప్పటినుంచి మెగా ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. దీనికి తగ్గట్టుగానే ఉపాసన లగ్జరీ మెటర్నిటీ ఫ్యాషన్ స్టైల్స్ తో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ స్నేహితులు, మెగా కుటుంబ సభ్యులు.. బంధుమిత్రుల సమక్షంలో ఎంతో వైభవంగా నిర్వహించిన బేబీ షవర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

రామ్ చరణ్ ఉపాసన స్నేహితులు స్మితారెడ్డి, సరిన్ కట్ట త్వరలో కాబోయే మమ్మీ ఉపాసనకు ఇంటిమేట్ బేబీ షవర్ నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకు అల్లు అర్జున్, సానియా మీర్జా, కనిక కపూర్ ఇలా చాలామంది ప్రముఖులతో పాటు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కోసం ఉపాసన గులాబీ రంగులో తన బేబీ బంప్ ప్రదర్శిస్తూ కనిపించిన సంగతి తెలిసిందే. ఆ పింక్ గౌన్ ధర ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్‌ టాపిక్ గా మారింది. ఉపాసన కామినేని వేసుకున్న పింక్ థియేటర్ డ్రెస్ చాలా బాగుంది.

డీప్ వీనెక్‌, షార్ట్ స్లీవ్స్‌తో ఉన్న గౌను నీడిల్ థ్రెడ్ బ్రాండ్‌కు చెందింది. దీని రేటు 1102 డీల‌ర్లు. దీని రేటు అక్ష‌రాలా రేటు 90,471. తాజాగా నిర్వ‌హించిన మ‌రో బేబీ బంప్‌న‌కు ఉపాస‌న జ‌ప‌నీస్ బ్రాండ్స్ మిస్సీ మియాకే బ్లూ క‌ల‌ర్ ప్లీటెడ్ ట్యూనిక్ డ్రెస్‌లో అల‌రించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ట్యూనిక్ ధ‌ర 430 డాల‌ర్లు అంటే రు. 35,352 ఉంది.

అలాగే ప్రెగ్నెన్సీ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి ఉపాస‌న గ్లామ‌ర‌స్ ప్రెగ్నెన్సీ స్టైల్లో త‌న ఫ్యాన్స్‌ను క‌ట్టి ప‌డేస్తున్నారు. మొద‌టి మూడు నెల‌ల్లోనే ఒక‌సారి తెల్ల‌టి రంగు పూల డ్రెస్‌లో క‌నిపించారు. ఈ డ్రెస్ బ్రాండ్ జిమ్మార్‌మేన్‌కు చెందింది. దీని రేటు రు. 1,11,651.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news