Movies30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకుని 10 మంది స్టార్ హీరోయిన్లు...

30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకుని 10 మంది స్టార్ హీరోయిన్లు వీళ్లే… కార‌ణాలు ఇవే…!

సినిమా రంగంలో హీరోయిన్ల‌కు లైఫ్ స్పాం త‌క్కువ ఉంటుంది. ఐదారేళ్లు వాళ్లు హీరోయిన్లుగా రాణిస్తేనే గొప్ప‌. న‌య‌న‌తార లాంటి ఒక‌రిద్ద‌రికే గొప్ప అవ‌కాశం ఉంటుంది. చాలా మంది హీరోయిన్లు ఇటీవ‌ల కాలంలో వ‌య‌స్సు పైబ‌డుతున్నా సినిమాల్లో కంటిన్యూ అవుతున్నారు. హీరోయిన్ల కొర‌త ఉండ‌డం కూడా ఇందుకు కార‌ణం.

కొంద‌రు ప్రేమ‌లో ప‌డి బ్రేక‌ప్‌లు చెప్పేసుకుంటూ.. 40 ఏళ్లు వ‌చ్చినా పెళ్లిళ్ల‌కు దూరంగా ఉంటున్నారు. 30 + ఏజ్ ఉండి కూడా పెళ్లికి దూరంగా ఉన్న కొంద‌రు హీరోయిన్లు ఎవ‌రో ఆ లిస్ట్ చూద్దాం.

టబు: సీనియర్ హీరోయిన్ టబు వ‌య‌స్సు 50 ఏళ్ల దాటుతున్నా పెళ్లికి దూరంగా ఉంటోంది. హైద‌రాబాద్‌లోనే ఉంటున్న ఆమె కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తోంది.
అనుష్క శెట్టి: నాలుగు ప‌దుల వ‌య‌స్సుకు చేరువ అయిన‌ ముదురు ముద్దుగుమ్మ అనుష్క ఇంకా పెళ్లి అన్న మాటే అన‌డం లేదు. చాలా రోజుల నుంచి ప్ర‌భాస్‌, అనుష్క ప్రేమ‌లో ఉన్నార‌ని.. అందుకే వీరు పెళ్లి చేసుకోవ‌డం లేదంటున్నారు.


తాప్సీ పన్ను: ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తాప్సీ వ‌య‌స్సు 34. ఇంకా సినిమాల్లో చేస్తూ పెళ్లి అన్న మాటే ఎత్త‌డం లేదు.

తమన్నా: మిల్కీ బ్యూటీ తమన్నా 34 ఏళ్ళ వయసు వచ్చినా పెళ్లి చేసుకోవడం లేదు. ఆమెకు ఇంకా హీరోయిన్ ఛాన్సులు వ‌స్తుండ‌డంతో పెళ్లి మాటే ఎత్త‌డం లేదు. త‌మ‌న్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది.


పూజా హెగ్డే : 31 ఏళ్ల పూజ హెగ్డే స‌క్సెస్ ఫుల్ హీరోయిన్‌గా కెరీర్ కంటిన్యూ చేస్తూ ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు.
త్రిష: నాలుగు పదులు వయసులో ఉన్న త్రిష చాలా మంది హీరోయిన్ల‌తో ఎఫైర్లు న‌డిపి పెళ్లి చేసుకోలేదు. ఆమెకు వ‌రుణ్ మ‌ణియ‌న్‌తో ఎంగేజ్మెంట్ జ‌రిగి కూడా క్యాన్సిల్ అయ్యింది.

శృతిహాసన్ : కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ 38 ఏళ్లు వ‌చ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆమె ఇప్ప‌టికే రెండు మూడు ఎఫైర్లు న‌డిపింది. ప్ర‌స్తుతం డూడుల్ ఆర్టిస్ట్ శాంతాను హాజరికతో రిలేషన్ లో ఉంది.
రకుల్ ప్రీత్ సింగ్: 34 ఏళ్ల రకుల్ ప్రీత్ బాలీవుడ్ నిర్మాత‌ జాకీ భాగ్నానితో ప్రేమలో ఉంది.
ఇలియానా: 36 ఏళ్ల వయసున్న ఇలియానాకు ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫ‌ర్ ఆండ్రూతో బ్రేక‌ప్ అయ్యింది. ఇటీవ‌లే నేను త‌ల్లి అవుతున్నాన‌ని చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చింది.


నిత్యామీనన్ : మలయాళ బ్యూటీ నిత్య మీనన్ 34 ఏళ్ల వయసున్నా పెళ్లి చేసుకోలేదు. ఆమెకు ఇంకా సినిమా ఛాన్సులు వ‌స్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news