బాలీవుడ్ నటి టబు. తెలుగు చిత్రసీమకు చెందిన అగ్ర నటుడు అక్కినేని నాగార్జున. వీరిద్దరి మధ్య ప్రే మాయణం సాగిందనే ప్రచారం 1990లలో భారీగా సాగింది. ఒక్క ప్రేమాయణమే కాదు.. ఇరువురూ కూడా విదేశాల్లో కలిసి ఉన్నారని.. పర్సనల్ టచ్‌లోకి వెళ్లారని కూడా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అనేక గ్యాసిప్‌లు వెలుగు చూశాయి. ఇక, వీరిద్దరూ కూడా కలిసి నటించిన సినిమాల్లో టబు చాలా బోల్డ్ గా నటించేసింది.
నటన పరంగా పాత్రలు డామినేషన్ చేస్తే.. తప్పదు కానీ.. అవసరం లేకపోయినా.. ఇష్టంగా నటించడంతో టబు-నాగార్జునల మధ్య ఏదో జరిగిందనే వాదనకు ఇది బలాన్ని చేకూర్చింది. ఇక, వీరిద్దరూ సిసింద్రీ సినిమా నుంచి ఆవిడా మా ఆవిడే, నిన్నే పెళ్లాడతా వంటి హిట్ సినిమాల్లో నటించారు. నిన్నే పెళ్లాడతా షూటింగ్ సమయంలోనే ఇద్దరూ ఒకరికొకరు ప్రెపోజ్ చేసుకున్నారని అంటారు.
అయితే.. అప్పటికే నాగార్జున అమలతో ప్రేమ వివాహం చేసుకుని ఉండడంతో టబుతో కేవలం స్నేహం గానే మెలిగారని, కానీ, ఇది హద్దులు మీరిందనే ప్రచారం జోరుగా సాగింది. ఇక, సినీ ఇండస్ట్రీలో ఇవన్నీ కామనే అనుకునే పరిస్థితి ఎలానూ ఉంది కాబట్టి.. చాలా మంది దీనిని లైట్ తీసుకున్నారు. ఇక, నాగార్జున మాత్రం తాను అప్పట్లో నటించిన ప్రతి సినిమాలోనూ టబు కావాలని పట్టుబట్టేవారట.
ఈ పరిచయంతోనే టబుకు.. అనేక అవకాశాలు వచ్చాయని అంటారు. ఏదేమైనా.. తెరవెనుక ఏం జరిగిందో కానీ, టబు-నాగార్జున విషయం మాత్రం ప్రేక్షకులకు ఇటు సినిమాల పరంగానే కాకుండా.. గ్యాసిప్‌ల పరంగా కూడా.. విందు చేయడం విశేషం. తర్వాత.. కొన్నాళ్లకు తెలుగు ఇండస్ట్రీకి దూరమైన టబు.. తర్వాత.. పాండురంగడు మూవీతో ఎంట్రీ ఇవ్వడం విశేషం.