కళా తపస్వి కే. విశ్వనాథ్ తీసిన అనేక అగ్ర సినిమాల్లో.. స్వర్ణ కమలం ఒకటి. అప్పటికి మంచి ఫామ్‌లో ఉన్న వెంకటేష్‌ను హీరోగా పెట్టుకుని తీసిన ప్రయోగం కూడా. నిజానికి వెంకటేష్ నటించాల్సిన సినిమా కాదని.. ఆయన తండ్రి పప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు చెప్పేవారు. కానీ, అలా జరిగిపోయింది అనే వారు. ఎందుకంటే.. ఈ సినిమాలో ఎక్కడా ఫైట్లు ఉండవు. పైగా.. హీరో పాత్ర కన్నా.. సినిమా అంతా కూడా.. హీరోయిన్ చుట్టూనే సినిమా తిరుగుతుంది.
ఇక, ఈ సినిమాలో ముందుగా శోభనను బుక్ చేసుకున్నారు. దీనికి కారణం.. ఆమెకు భరత నాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది. శోభన భరతనాట్యం అంటే అప్పట్లో సౌత్ ఇండియాలోనే తిరుగులేని క్రేజ్ ఉండేది. స్టార్ హీరోలు, ఎంతోమంది సెలబ్రిటీలు కూడా శోభన భరతనాట్యం లైవ్‌లో చూసేందుకు పరితపించి పోయేవారు.
ఈ క్రమంలోనే స్వర్ణకమలంలో నటించేందుకు శోభనకు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. సినిమా మొదలు పెట్టాలని అనుకున్న సమయానికి ఇబ్బంది వచ్చింది.. దీంతో వాయిదా పడింది. ఇక, అప్పటికే శోభన కొన్ని సినిమాలు బుక్ చేసుకుని ఉండడంతో తర్వాత.. డేట్స్ కుదరలేదు. దీంతో ఆమె వదులుకున్నారు.
ఇదే సమయంలో రామానాయుడు ఎంట్రీ ఇచ్చి.. భానుప్రియను తీసుకోవాలని.. సలహా ఇచ్చారు.
భాను ప్రియను.. ఆడిషన్‌కు పిలిచారు. ఆమెకు డ్యాన్స్ తప్ప.. నృత్య రీతులు తెలియదు. దీంతో ఏం చేయాలా? అని ఆలోచించి.. చివరకు 15 రోజులు ఆమెకు వెంపటి చిన సత్యం (సినిమాకు కూడా ఆయనే చేశారు) దగ్గర ట్రైనింగ్ ఇచ్చి మరీ తీసుకున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే సినిమా సూపర్ హిట్ అయ్యి భానుప్రియ పాత్రకు మంచి పేరు వచ్చాక శోభన మంచి సినిమా మిస్ అయ్యానని ఎంతో బాధపడింది.