Moviesరాజీవ్ కంటే ముందే సుమ ఆయనతో రిలేషన్ లో ఉందా..? గతిలేక...

రాజీవ్ కంటే ముందే సుమ ఆయనతో రిలేషన్ లో ఉందా..? గతిలేక ఇలా కమిట్ అయ్యిందా..?

సుమ ..ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా తన కంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సుమ .. తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ వస్తుంది . ఏ ఈవెంట్ అయినా ..ఏ ఆడియో ఫంక్షన్ అయినా.. సక్సెస్ మీట్ అయినా.. సక్సెస్ సెలబ్రేషన్స్ అయినా ..సుమ ఉండాల్సిందే. ఆశ్చర్యం ఏంటంటే అడిగిమరీ ఏరి కోరి సుమని యాంకర్ గా పెట్టుకున్న స్టార్ హీరోస్ ఎంతోమంది ఉన్నారు .

కాగా అలాంటి సుమపై రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవ్వడం ఇప్పుడు ఆమె ఫ్యాన్స్ కు ఇబ్బందికరంగా ఉంది . మనకు తెలిసిందే సుమ.. రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం మొత్తం అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా తెర పై మరో సెన్సేషనల్ మ్యాటర్ వైరల్ గా మారింది. సుమ యాంకరింగ్ స్టార్ట్ చేసే ముందు సినిమాలో కూడా నటించిన విషయం తెలిసిందే.

దాసరి నారాయణరావు డైరెక్షన్లో కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది . ఈ సినిమాలో వక్కంతం వంశీ హీరోగా చేశారు . ఈ సినిమాలో బోలెడు రొమాన్స్ సీన్స్ ఉన్నాయి. తెర పై అవి బాగా కనిపించాయి . దీంతో అప్పట్లో వీళ్ళు ఇద్దరు ప్రేమించుకుంటున్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి . అయితే అలాంటిది ఏది జరగలేదు. సిన్ కట్ చేస్తే సుమ ఆ తర్వాత రెండు మూడు మలయాళం సినిమాలు చేసి అవి ఫ్లాప్ అవడంతో యాంకర్ గా సెటిల్ అయింది . ఈ క్రమంలోని రాజీవ్ కనకాల తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లైయ్యింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news