తెలుగు సినీ రంగంలో తమకంటూ ప్రత్యేక స్టేజ్‌ను ఏర్పాటు చేసుకున్న అగ్రహాస్య నటులు తెలిసిందే. రాజబాబు, రమణారెడ్డి, అంజి, పద్మనాభం, రేలంగి వంటి వారు ప్రముఖంగా కనిపించేవారు. వీరంతా కూడా స్టేజ్ డ్రామా ఆర్టిస్టులుగానే అరంగేట్రం చేశారు. ఒక్కొక్కరు ఒక్క దశలో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చినా.. అంతిమంగా.. అందరూ కలిసి మాత్రం నటించిన సినిమా కూడా ఉంది. అదే .. పరమానందయ్య శిష్యుల కథ. ఈ సినిమలో రేలంగి మినహా.. అందరూ కలిసి నటించారు.
ఇక, వారి వారి వ్యక్తిగత విషయాలకు వస్తే.. అందరూ కూడా మంచి ఆర్టిస్టులే డిమాండ్ ఉన్న ఆర్టిస్టులే కావ డం గమనార్హం. పైగా అప్పట్లోనే పోటీ పడి మరీ రెమ్యునరేషన్లు తీసుకున్నవారు కూడా ఉన్నారు. రాజబాబు – రేలంగి పోటీ పడి రెమ్యునరేషన్ పెంచుకున్నారు. రమణారెడ్డి కూడా అంతే,ఇక అంజి ఎంతిస్తే.. అంతే తీసుకునేవాడు తప్ప.. పెద్దగా డిమాండ్ చేయలేదు. మరోవైపు.. పద్మనాభం మాత్రం మొదట్లో ఎంతిచ్చినా తీసుకున్నా.. తర్వాత మాత్రం డిమాండ్ చేయడం ప్రారంభించారు.
ఇలా.. ఈ తెలుగు ఓల్డ్ హాస్య నటులు అందరూ కూడా బాగానే సంపాయించుకున్నారు. మరి వీరి ఆస్తులు ఏమయ్యాయి? అనేది ప్రశ్న. రాజబాబు ఆస్తులను.. తన భార్య లాగేసుకుని విడాకులు ఇచ్చిందని ప్రచారం ఉంది. చివరి దశలో అంతా తలో కొంత వేసుకుని కార్యక్రమం పూర్తి చేశారని.. ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకొంటారు. రమణారెడ్డి తన ఆస్తులను పాస్తులను కుటుంబానికి రాసేసి.. తాను మాత్రం రమణాశ్రమంలో చేరి.. చివరి దశలో సుఖంగా పోయారని చెబుతారు.
అంజి పెద్దగా పోగు చేసుకోలేదు. కానీ, గౌరవంగా బతికాడని చెబుతారు. పద్మనాభం సినిమాలు తీశారు. అయితే.. చివరి దశలో నష్టాలతో ఇబ్బంది పడి.. సీరియళ్లలో నటించి.. పొట్ట పోసుకున్నారు. రేలంగి.. చాలా జాగ్రత్తగా వ్యవహరించినా.. ఆయన కొనుగోలు చేసిన ఆస్తులు వివాదాల్లో చిక్కుకున్నాయి.
ప్రస్తుతం చెన్నైలో ఉన్న విజయాగార్డెన్ రేలంగిదే. దీనిపైకోర్టులో ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి. ఇప్పటికి 60 ఏళ్ల నుంచి ఈ కేసు నడుస్తూనే ఉంది. కొడిక్కి సినిమా హాలు కట్టించారు.