తెలుగు చిత్ర సీమలో మనసులు కలిసినా.. మనువాడ లేకపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారిలో హీరోలు .. హీరోయిన్లేకాకుండా.. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. రాజబాబు -రమాప్రభ, గీతాంజ లి-పద్మనాభం, రేలంగి-గీతాంజలి (ఓల్డ్), ఎస్వీఆర్-ఛాయాదేవి, ఎస్. వరలక్ష్మి-గుమ్మడి వంటివారు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా తెరకెక్కారు. అయితే..తర్వాత కాలంలో వీరి మధ్య సాహచర్యం పెరిగింది.
ఇదే ప్రేమగా మారింది. అయితే.. అప్పటికే వివాహాలు అయిపోయిన వీరంతా.. చూసుకుంటూ గడిపారే తప్ప.. ఏమీ చేయలేని పరిస్థితి. అయితే..ఈ ప్రేమమోహంలో రాజబాబు, రేలంగి, ఎస్వీఆర్ వంటివారు.. వ్యసనాలకు బానిసయ్యారు. రాజబాబ తాగందే.. షూటింగుకు కూడా వచ్చేవారు కాదు. రమాప్రభను అంత పిచ్చిగా ప్రేమించేశాడు. ఆమె లేకపోతే ఉండేవాడే కాదు.
అయితే ఇటు వైపు భార్య పోరు ఉండేది. భార్య మాత్రం రాజబాబును చీటికి మాటికి అనుమానిస్తూ కండీషన్లు పెట్టేదట. దీంతో ఆయన షూటింగ్ సమయంలోనూ తాగే పరిస్థితి. ఇక, ఎస్వీఆర్ కూడా అంతే. ఆయన మందు మామూలుగా కొట్టేవాడు కాదు. ఇక గీతాంజలిని పిచ్చిగా ప్రేమించిన పద్మనాభం మనసు మార్చుకునేందుకు వేరేవ్యసనాల జోలికి వెళ్లారని టాక్.
ఇక, హీరో హీరోయిన్ల విషయానికి వస్తే.. శోభన్‌బాబు-జయలలిత గురించి ఇప్పటికీ ఒక మిస్టరీ హల్చల్ చేస్తూనే ఉంది. దీనిని విప్పి చెప్పేవారే లేకుండా పోయారు. అదేవిధంగా భానుమతి-అక్కినేని(ఆశ్చర్యమే అయినా.. నిజమని అప్పటి దర్శకుడు ఒకరు చెప్పారు), కృష్ణకుమారి కూడా ఎన్టీఆర్‌తో ప్రేమలో పడింది. కానీ, తెరమీదికి రాలేదు. ఇక, చిరు-రాధ, విజయశాంతి-బాలయ్య ఇలా .. చాలా మంది హీరోలుహీరోయిన్లు ప్రేమించుకున్నారు. కానీ, వీరు పెళ్లిదాకా అడుగులు వేయలేక పోయారు.