సినీరంగం అంటేనే విజయ-పరాజయాల సమ్మేళనం. ఒక సినిమా సూపర్ హిట్ కొట్టొచ్చు. ఏకంగా ఏళ్ల తరబడి ఆడనూ వచ్చు. అయితే..తర్వాత వచ్చిన సినిమా.. అదే హీరోకు చేదు అనుభవం కూడా మిగిలించి ఉండొచ్చు. ఇలాంటి ఘటనలు అందరి హీరోలకూ సమానమే. ఎన్టీఆర్ నుంచి ఏఎన్నార్ వరకు..హీరో కృష్ణ నుంచి శోభన్ బాబు వరకు అనేక మంది ఇలాంటి జయ-పరాజయాలను చవిచూసిన వారే.
అయితే.. ముఖ్యంగా ఎన్టీఆర్ ఇలాంటి వాటి విషయంలో ముందుగానేజాగ్రత్త పడేవారు. ఆయనెంతో శ్రమించి తీసిన సీతారామకళ్యాణం.. తక్కువ బడ్జెట్లో తీశారు. అంతేకాదు.. ఈ సినిమా పూర్తి రావణా సురుడి జీవిత చరిత్రకు పెద్దపీట వేశారు. పేరు సీతారామకళ్యాణం అనే టైటిల్ పెట్టినా.. రావణాసురుడి పాత్రలో అన్నగారు నటించి.. ప్రాణం పోశారు. అయితే..సినిమాపై అంచనాల విషయంలో అన్నగారు ఇబ్బంది పడ్డారు.
దీంతో తక్కువ బడ్జెట్‌తో సినిమాను రూపొందించారు. అయితే.. ఈ సినిమా సూపర్ హిట్ కొట్టింది. మంచి ఆదాయం కూడా వచ్చింది. ఇదిలావుంటే.. ఇదేస్ఫూర్తితో తర్వాత తీసిన శ్రీకృష్ణ పాండవీయం అన్నగారికి తీవ్ర నిరాస మిగిల్చింది. ఈ సినిమాకు పెద్ద పెట్టుబడులు పెట్టారు. మంచి మంచి సెట్టింగులు వేశారు. అయితే.. ఈ సినిమా అనుకున్న విధంగా అయితే.. ఆడలేదు. దీంతో నష్టాల బాట పట్టక తప్పలేదు.
దీంతో అన్నగారు నష్టాల నుంచి బయట పడేందుకువెంటనే ఐడియా వేశారు. శ్రీకృష్ణ పాండవీయం సినిమాను తమిళం, కన్నడ భాషల్లోనూ నేరుగా డబ్బింగ్ చెప్పించి విడుదల చేశారు. తమిళంలో ఈ సినిమా బాగా ఆడింది . దీంతో నష్టాల నుంచి బయటకు వచ్చారు. అంటే.. ఒకసినిమా ఫట్ అయినా.. కుంగిపోకుండా.. వెంటనే వేరే భాషలో ఆయనదానిని విడుదల చేయడంతో నష్టాల నుంచి బయట పడ్డారన్నమాట.