టాలీవుడ్ ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు కుమారుడుగా విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి వెంకటేష్ కు హీరో అవ్వడం ఇష్టం లేకపోయినా తండ్రి బలవంతంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక అలా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలలో ఒకరిగా నిలిచాడు. చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో వెంకటేష్ పోటీ పడ్డాడు. ఇక రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ రామానాయుడు వెబ్ సిరీస్ తో తన పేరును తానే చెడగొట్టుకున్నాడు.
రామానాయుడు లాంటి బోల్డ్ వెబ్ సిరీస్ లో వెంకీ నటించడం ఆయన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఒకప్పుడు మాత్రం వెంకటేష్ అంటే ఫ్యామిలీ హీరో…ఆయన సినిమా వచ్చిందంటే కుటుంబం అంతా కలిసి హ్యాపీగా చూసేవారు. అంతే కాకుండా వెంకటేష్ సౌందర్య కాంబినేషన్ అంటే అప్పట్లో మామూలు క్రేజ్ ఉండేది కాదు. వీరిద్దరి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి.
జయంమనదేరా, చంటి, దేవిపుత్రుడు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, రాజా లాంటి సినిమాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చినవే. అయితే వెంకటేష్ సౌందర్యలు వరుసగా కలిసి నటించడం తో వీరిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు పుట్టుకువచ్చాయి. అయితే ఆ లవ్ ఎఫైర్ వార్తలను ఆపేయాలని రామానాయుడు నిర్ణయం తీసుకున్నారు. వెంకటేష్ కారణంగా సౌందర్య కెరీర్ నాశనం అవ్వకూడదని అనుకున్నారు. సౌందర్యకు ఎలాంటి చెడ్డపేరు రాకూదని భావించారట.
దాంతో వెంకటేష్ – సౌందర్య కాంబినేషన్ లో ఇక పై సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు.ఆ తరవాత చాలా కాలం పాటూ వీరిద్దరి కాంబినేసన్ లో సినిమాలు ఆగిపోయాయి. కానీ ఆ తరవాత అభిమానుల కోరికమేరకు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాలు తీయడం మొదలు పెట్టారు. అలా రామానాయుడు సినిమాలు హిట్ అయితే డబ్బులు వస్తాయని ఆశించకుండా సౌందర్య కెరీర్ గురించి ఆలోచించడం నిజంగా మంచి నిర్నయమే.