దివంగత నటి సౌందర్య ఈ పేరు చెప్తే జనాల కళ్ళల్లో వాళ్ళకి తెలియకుండానే నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. తెలియకుండానే మనసులో ఏదో తెలియని కొత్త ఫీలింగ్ ఏర్పడుతూ ఉంటుంది . ఈమె మా అమ్మాయి అని తెలియకుండానే వచ్చేస్తూ ఉంటుంది . దీని అంతటికి కారణం సౌందర్య నేచురల్ యాక్టింగ్ అనే చెప్పాలి . సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో రాణించి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో హోమ్లి బ్యూటీగా పేరు సంపాదించుకున్న సౌందర్య.. మన మధ్య లేకపోయినా సరే తన సినిమాల రూపంలో ఇప్పటికి మనల్ని పలకరిస్తూనే ఉంటుంది.
కాగా అప్పట్లో ఇండస్ట్రీలో సౌందర్యకి ఎలాంటి అరుదైన గౌరవం దక్కేదో మనందరికీ తెలిసిందే . ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీస్ ఎంతమంది ఉన్నా .. సౌందర్యానే మా సినిమాలో హీరోయిన్గా పెట్టుకోవాలి అంటూ మెగాస్టార్ చిరంజీవి – వెంకటేష్ -నాగార్జున ఇలా ఎంతోమంది హీరోలు ఆమె కోసమే.. ఆమె డేట్లు కోసమే వెయిట్ చేసేవారు ..అంటే సౌందర్య ఎంత మంచి నటి అన్న విషయం మనం అర్థం చేసుకోవచ్చు . అయితే అలాంటి హీరోయిన్ చనిపోయిందని ఓ హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అయింది అన్న వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి .
ఆ హీరోయిన్ ఎవరో కాదు హోమ్లీ బ్యూటీ స్నేహ . ఎస్ సౌందర్య చనిపోతే స్నేహ హ్యాపీగా ఫీల్ అయింది అన్న వార్త అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన స్నేహకు ఇదే ప్రశ్న ఎదురయింది . ఈ క్రమంలోని “నేను అలాంటి క్యారెక్టర్ కాదని.. నాది ఆ టైప్ కాదని.. సౌందర్య చనిపోతే నేను ఎంతలా బాధపడ్డానో ..తన చుట్టూ ఉండే వాళ్లకు తెలుసని ..అందరూ సౌందర్య చనిపోయిన తర్వాత హోమ్లీ క్యారెక్టర్స్ నాకు వచ్చాయని అనుకుంటున్నారని.. అయితే అలాంటిది ఏది కాదని, సౌందర్యకి నేను కూడా బిగ్ ఫ్యాన్ “అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే అప్పట్లో స్నేహ ఇలాంటి కామెంట్స్ చేసి తన వైపు తప్పు లేదని ప్రూవ్ చేసుకుంది . అంతేకాదు స్నేహ క్యారెక్టర్ పరంగా కూడా అలాంటిది కాదు ..చేతనైతే సహాయం చేస్తుంది కాని ..తెలిసి తెలిసి ఎవరిని నిందించదు ..మోసం చేయరు.. అంటూ స్నేహ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.