సినిమా రంగం అనేది గ్లామర్ ప్రపంచం. ఈ రంగంలో ఒక వెలుగు వెలిగిపోవాలని ఎన్నో ఆశలతో ఎంతోమంది అమ్మాయిలు వస్తారు. వారిలో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. కొందరు ఇక్కడ నుంచి వెనక్కు వెళ్లలేక.. ఇక్కడ నిలదొక్కుకోవడం కోసం ఎన్నో అడ్డదారులు తొక్కుతారు. మరికొందరు హీరోయిన్లు లగ్జరీ లైఫ్ కోసం అలవాటు పడి.. లేదా ఛాన్సులు తగ్గిపోయాక అడ్డదారులు తొక్కి పరువు పోగొట్టుకుంటూ ఉంటారు. ఈ లిస్టులో చాలామంది టాలీవుడ్ హీరోయిన్లు ఉన్నారు.
లగ్జరీ లైఫ్ కోసం అలవాటు పడి వ్యభిచారం చేయడంతో పాటు వ్యభిచార గృహాలు నడుపుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. జగపతిబాబుతో పెద్దరికం లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాలో నటించిన సుకన్య మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆమె మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలో మహేష్ కు తల్లిగా నటించారు. అయితే ఆమె లగ్జరీ లైఫ్ కోసం చెన్నైలో వ్యభిచారం చేసే వారని.. అంతేకాకుండా వ్యభిచార గృహం నడుపుతూ పోలీసులకు దొరికిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి.
అలాగే తెలుగులో పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ భువనేశ్వరి ఆంటీ, హీరోయిన్ సైరాబాను కూడా వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికిన వాళ్లే. అలాగే కొత్త బంగారులోకం సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన శ్వేతా బసు ప్రసాద్ హైదరాబాదులో వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. పోలీసులు విచారణలో కూడా తాను ఇలా చేయటానికి సినిమాలలో ఆఫర్లు తగ్గిపోవటం అని ఓపెన్ గానే ఒప్పుకుంది. చివరకు ఆమె జునైల్ హోమ్ లో కూడా ఉండి వచ్చింది.
అలాగే వెంకటేష్ కి జోడిగా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో నటించిన హీరోయిన్ వినీత కూడా లగ్జరీ లైకు అలవాటు పడి చెన్నైలో వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికిపోయింది. అలాగే మరో హీరోయిన్ జయలక్ష్మి కూడా ఇదే వృత్తిలో ఉంటూ పోలీసులకు పట్టుబడింది. ఇలా చాలామంది హీరోయిన్లు లగ్జరీ లైఫ్ కోసం అడ్డదారులు తొక్కుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.