నటనలో తనకంటూ.. విలక్షణతను ప్రదర్శించే నటుడు శరత్‌బాబు. ఇది కథకాదు.. సినిమాలో ఆయన హీరో. అదేవిధంగా తమిళంలోనూ అనేక సినిమాల్లో నటించారు. ఆయన అసలు ఇండస్ట్రీకి వచ్చిందే.. హీరోగా. ఇలా హీరోగా నటించిన సినిమాలు కూడా హిట్టయ్యాయి. అప్పట్లో చిరంజీవి ఎదుగుతున్న దశ. అదేసమయంలో మరో హీరో.. రంగనాథ్ కూడా గట్టి పోటీగా ఉండేవారు.
ఇలాంటి కీలక సమయంలో దర్శకులు.. ఆచి తూచి వ్యవహరించేవారు. దీంతో శరత్ బాబు కంటే కూడా.. అభిమాన గణం ఎక్కువగా ఉన్న చిరంజీవివైపు దర్శకులు, నిర్మాతలు మొగ్గు చూపేవారు. అభిమానులను పెంచుకోవడంలోనూ.. వారినిప్రోత్సహించడంలోనూ.. రంగనాథ్, శరత్‌బాబు వెనుకంజ వేశారు. దీంతో వారికి పెద్దగా అభిమాన సంఘాలు లేకుండా పోయాయి. దీంతో నిర్మాతలు.. దర్శకులు చిరంజీవి వైపే ఉన్నారు.
ఫలితంగా ఒక దశలో శరత్‌బాబుకు సినిమాలు రావడం ఆగిపోయాయి. దీనిని గమనించిన బాలచందర్.. నా దగ్గర క్యారెక్టర్ పాత్ర ఉంది పోషిస్తావా? అంటూ.. అడగడం.. శరత్‌బాబు.. బాలచందర్ వంటి దర్శకుడు అడగడం నేను నటించకపోతే ఎలా .? అని అనుకోవడంతో అప్పటి నుంచి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. తర్వాత.. వచ్చిన వంశీ సినిమాల్లో కూడా.. క్యారెక్టర్ పాత్రలే వచ్చాయి. సితార సినిమాలో మంచి పేరు కూడా వచ్చింది.
అయితే.. శరత్‌బాబులో ఉన్న మరోకోణాన్ని బయటకు తీసింది.. దాసరి నారాయణరావు. నువ్వు హీరో కంటే కూడా.. విలన్‌గా బాగా రాణిస్తావు.. అని చెప్పి.. ఆయనకు విలన్ పాత్ర ఇచ్చింది దాసరే. దీంతో ఆ తర్వాత.. ఆయన గ్రాఫ్ పెరిగింది. చాలా ఏళ్లపాటు పదుల సంఖ్యలో సినిమాల్లో శరత్‌బాబు విలనీ పాత్రలే పోషించారు. కానీ, ఆయనకు మాత్రం హీరోగా పేరు తెచ్చుకోలేక పోయాననే చింత మాత్రం మిగిలిపోయింది.