సంయుక్తా మీనన్ టాలీవుడ్లో వరుసగా బ్యాక్ టూ బ్యాక్ నాలుగు హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది. భీమ్లా నాయక్ – బింబిసారా – సర్ – విరూపాక్ష ఈ నాలుగు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. రెండు సినిమాలు ఒక బ్యానర్ లో.. మరో సినిమా ఇంకో బ్యానర్ లో.. చేతిలో మరో సినిమా కూడా ఉంది. అలాగే కళ్యాణ్‌రామ్‌తో అభిషేక్ నామ నిర్మించే పిరియాడిక్ సినిమాలోనూ సంయుక్త హీరోయిన్.
వరుసగా హిట్లు కొట్టి హోమ్‌లీగా ఉంటూ కాస్త కూసో గ్లామర్ ఉన్న ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్‌గా వరుస అవకాశాలు వెతుక్కుంటూ రావాలి.. ఒక్కరోజు కూడా ఖాళీ ఉండకూడదు. అయితే సంయుక్త పరిస్థితి అలా లేదని.. అందుకు ఆమె ప్రవర్తన కారణమన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. నిజానికి ఇప్పుడు నిర్మాతలు, దర్శకులు అందరూ సంయుక్త వెంటపడాలి. ఆమె రెమ్యూనరేషన్ పెంచాలి.. కానీ ఇలా జరుగుతున్నట్టు లేదు.
కారణం ఏంటని ? ఆరాధిస్తే ఆమెను హీరోయిన్‌గా తీసుకునేందుకు నిర్మాతలు పెద్దగా ఆసక్తి కనపరచడం లేదట. ఇప్పటికే ఆమెతో సినిమా తీసిన దర్శక నిర్మాతలు అబ్బే ఇప్పటికే ఆమెను ఒకసారి చూసేసాం కదా.. మళ్లీ ఆమె ఎందుకు ? అని పెదవి విరుస్తున్నారట. ఇక ఇటీవల సంయుక్త షూటింగ్లో అస్సలు టైం పాటించటం లేదన్న కంప్లైంట్లు వస్తున్నాయి. అది షూటింగ్ అయినా… సినిమా ఫంక్షన్లు అయినా కనీసం గంట నుంచి రెండు గంటలకు ఆలస్యంగా వస్తుందని అంటున్నారు.
కొందరైతే మరీ కష్టాలు కూడా ఏకరువు పెడుతున్నారు. ఇక షూటింగ్లలో హీరో వచ్చి షాట్ కోసం ఎదురుచూస్తున్నా కనీసం గంటకు పైగా ఆలస్యంగా వస్తుందట. ఆమె కోసం హీరోతో పాటు సినిమా షూటింగ్ యూనిట్ అందరూ వెయిట్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయట. ఇలా హీరోలు కూడా ఆమె విషయంలో అసంతృప్తిగా ఉండడంతోపాటు అవమానంగా ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా వరుసగా సక్సెస్ లో ఉన్న సంయుక్తకు అంత క్రేజ్ రాకపోవటానికి ఆమె ప్రవర్తన కారణమని అంటున్నారు. మరి ఆమె తీరు మార్చుకుంటుందో లేదో చూడాలి.