టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత.. ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో భారీ అంచనాలతో తెరకెక్కిన శాకుంతలం సినిమా డిజాస్టర్ కావడంతో సమంత మింగలేని కక్కలేని పొజిషన్లో ఉంది . ఇప్పుడు సమంత తన ఆశలు అన్ని తర్వాత శివనిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న ఖుషి సినిమా పైన పెట్టుకొని ఉంది .
విజయ్ దేవరకొండ ఈ సినిమాలో హీరోగా నటిస్తూ ఉండడం సినిమాకి ప్లస్ పాయింట్ గా మారనుంది అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు . కాగా ఇదే క్రమంలో శాకుంతలం సినిమా డిజాస్టర్ కావడంతో సమంత పై లేనిపోని రూమర్స్ క్రియేట్ చేస్తూ ఆమె పర్సనల్ లైఫ్ కి కూడా సోషల్ మీడియాలో డిజాస్టర్ గా ట్రోల్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే ట్రోలర్స్ హద్దులు మీరడంతో సమంత లీగల్ గా యాక్షన్ తీసుకునేందుకు సిద్ధపడింది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది.
ఇన్నాళ్లు ఎలాంటి రూమర్స్ వచ్చినా సైలెంట్ గా ఉన్న సమంత .. తన పర్సనల్ ఫ్యామిలీ లైఫ్ పై కూడా పిచ్చిగా ట్రోల్ చేస్తూ ఉండడం తో సైబర్ క్రైమ్ ని ఆశ్రయించడానికి సిద్ధపడినట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే ఈ విషయాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు ట్రోలర్స్. ” ఈ నిర్ణయం నువ్వు విడాకులు తీసుకున్న తర్వాత చేసుంటే ఇంకా బాగుండేది సమంత.. ఇన్ని వార్తలు నీపై వచ్చి ఉండేవి కావు.. ఇప్పటికి మేల్కొన్నావా..? నో ప్రాబ్లం ..క్యారీ ఆన్.. ఇప్పటికైనా నిద్ర మేల్కొన్నందుకు సంతోషం అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు..!!