మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ ఒక హిట్టు మూడు ప్లాకులు అన్నట్టుగా కొనసాగుతూ వస్తోంది. క్రాక్ సినిమాకు ముందు వరుసగా రవితేజ నటించిన అన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి. క్రాక్ సినిమాతో హిట్ కొట్టి ఎట్టకేలకు పామ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత ఖిలాడి – రామారావు ఆన్ డ్యూటీ రెండు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఇక గత ఏడాది చివర్లో చేసిన ధమాకా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా విజయంలో స్రీలీల పాత్రను కూడా మర్చిపోలేము.
రవితేజ కెరీర్ లోనే తొలిసారిగా రు. 100 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాగా ధమాకా రికార్డులకు ఎక్కింది. ఓవరాల్‌గా ధమాకా రు. 120 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. చాలా రోజుల తర్వాత రవితేజకు వరుసగా రెండు సూపర్ డూపర్ హిట్లు పడ్డాయి. ఆ వెంటనే రవితేజ పెద్ద గ్యాప్ లేకుండానే రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
స్వామిరారా అలాంటి మంచి థ్రిల్లర్ సినిమా తెరకెక్కించిన సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకుడు. ఏకంగా రవితేజకు జోడిగా ఐదుగురు హీరోయిన్లు నటించారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. రెండు సూపర్ డూపర్ హిట్లు ఉండి కూడా తొలి రోజు చాలా ఘోరమైన వసూళ్లు వచ్చాయి.
ఇక మరి ఘోరమైన అవమానం ఏంటంటే ? అసలు రెండో రోజు కలెక్షన్లు పూర్తిగా డ్రాప్ అయిపోయాయి. నైజాం లాంటి ఏరియాలో అసలు రెండో రోజు మార్నింగ్ షోకే అడ్వాన్స్ బుకింగ్ లు కూడా లేవు. అసలు రవితేజ ఇంత ఫామ్‌లో ఉండి కూడా రెండో రోజుకే ఆక్యుపెన్సీ పూర్తిగా పడిపోవడంతో భారీ రేట్లకు కొన్న వాళ్లంతా లబోదిబో మంటున్నారు. ఇక రవితేజ ఆశలు ఈ యేడాది రానున్న టైగర్ నాగేశ్వరరావు మీదే ఉన్నాయి.