Moviesరామ్‌చ‌ర‌ణ్ ' ఆరెంజ్ ' సినిమా టైటిల్ ఎలా పుట్టిందో తెలుసా......

రామ్‌చ‌ర‌ణ్ ‘ ఆరెంజ్ ‘ సినిమా టైటిల్ ఎలా పుట్టిందో తెలుసా… ఇంట్ర‌స్టింగ్ స్టోరీ..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో మగధీర ఎంత పెద్ద హిట్ సినిమాయో తెలిసిందే. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఎన్నికలలో ఓడిన తర్వాత మగధీర సినిమా రిలీజ్ అయింది. నిజం చెప్పాలంటే మగధీర సినిమా ఓడిపోయిన ప్రజారాజ్యం పార్టీ క్యాడర్లో కూడా ఎంతో ఉత్సాహం నింపింది. అలాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత రామ్ చరణ్ – జెనీలియా జంటగా 2010లో ఒక క్రేజీ లవ్ స్టోరీ గా రిలీజ్ అయింది ఆరెంజ్. హరీష్ జైరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు.

కాగా నాగబాబు నిర్మాత. ఈ సినిమా అప్పట్లో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అయింది. సినిమా కాన్సెప్ట్ బాగున్న మగధీర తర్వాత రిలీజ్ కావడంతో చరణ్ అభిమానులే ఈ సినిమాను చూడలేదు. రామ్ చరణ్ ను కంప్లీట్ లవర్ బాయ్‌గా అస్సలు ఊహించుకోలేదు. విచిత్రం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన ఇన్నేళ్ల‌కు ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే ఏకంగా మూడు కోట్ల వసూళ్లు సాధించి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది.

అప్పుడు ప్లాప్ అయిన సినిమా ఇప్పుడు జనాలకు అంత బాగా నచ్చేసింది. తాజాగా ఈ సినిమా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఆరెంజ్ అనే టైటిల్ ఎలా ? పెట్టారు వివరించారు. ఆరెంజ్ అనే టైటిల్ పెట్టాలని ఆలోచన దర్శకుడుదే. సినిమా స్టోరీకి తగినట్టుగా ఉంటుందని దీనిని సెలెక్ట్ చేసుకున్నారట. ప్రేమలో హెచ్చుతగ్గులు ఉంటాయని.. ఒక వ్యక్తిపై ప్రేమ ఎప్పుడూ ? ఒకేలా ఉండదు.. దీనిని సూర్యోదయం, సూర్యాస్తమయంతో పోల్చాను.. ఆ రెండు సమయాల్లోనూ సూర్యుడు ఆరెంజ్ రంగులో ఉంటాడు.. సూర్యోదయంలో ప్రేమ పెరగటాన్ని.. సూర్యాస్తమయంలో ప్రేమ తగ్గటాన్ని సూచిస్తుంది.

అందుకే ఆరెంజ్ పేరు పెట్టాను.. దీని గురించి వివరంగా చెప్పగానే మా టీం వాళ్లందరూ వెంటనే ఓకే చేశారు. అలా ఆరెంజ్ సినిమా టైటిల్ ఖరారు అయిందని భాస్కర్ తెలిపారు. ఈ సినిమాను ముందు న్యూయార్క్ లో షూట్ చేయాలని అనుకున్నామని.. షెడ్యూల్ సమయానికి అక్కడ చలి బాగా ఉండటంతో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో షూట్ చేసినట్టు భాస్కర్ తెలిపారు. స్టోరీ చాలా మందికి నచ్చిందని.. అయితే సినిమా ప్రేక్షకులకు ఎక్కకపోవటానికి స్క్రీన్ ప్లే సరిగా కుదరలేదని భాస్కర్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఏది ఏమైనా ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ ప్రేక్షకులు పిచ్చ‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news