మొదటి సినిమాతోనే గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ లలో నిఖీషా పటేల్ కూడా ఒకరు. పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో నటించిన కొమరం పులి సినిమాలో నికిషా పటేల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో నిఖీషా పటేల్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. మొదటి సినిమాతోనే పవన్ కళ్యాణ్ పక్కన నటించగా ఆ తర్వాత వరుస ఆఫర్ లు వస్తాయని అంతా అనుకున్నారు. అయితే కొమరం పులి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆ తర్వాత వచ్చిన అవకాశాలు సైతం వెనక్కి వెళ్ళిపోయాయి.
ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. కాగా ఓ ఇంటర్వ్యూలో నికిషా పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను సౌత్ లో ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయానో తనకు ఇప్పటికీ అర్థం కాదని చెప్పింది. తాను టాలీవుడ్ లో స్టార్ హీరో పక్కన నటించినప్పటికీ గుర్తింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అదృష్టం తనకు మొదటి డోర్ నుండి వస్తే దురదృష్టం వెనక డోర్ నుండి వచ్చింది అంటూ కామెంట్ చేసింది.
తనకు పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం వచ్చిన తర్వాత చాలామంది కుల్లుకున్నారని చెప్పింది. అప్పట్లో చాలామంది హీరోయిన్ లు పవన్ కళ్యాణ్ పక్కన నటించాలని కలలు కనే వారని చెప్పింది. కానీ కొమురం పులి సినిమా ఎందుకో వర్కౌట్ అవ్వలేదని తెలిపింది. దాని ఎఫెక్ట్ తన కెరీర్ మీద పడిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక తనకు మెగా హీరోయిన్ అనే ముద్ర పడిందని ఆ ముద్ర కూడా తన గుర్తింపును వెనక్కి తీసుకురాలేకపోయింది అని చెప్పింది.
అంతేకాకుండా ఆ ముద్ర నుండి బయట పడేందుకు పదేళ్లు పట్టిందని చెప్పింది. ఇక తాను లండన్ నుండి బాలీవుడ్ సినిమాలు చేసేందుకు వచ్చానని తెలిపింది. కానీ కొన్ని కారణాల వల్ల సౌత్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాల్సి వచ్చిందని వెల్లడించింది. కానీ తెలుగు సినిమాల వల్ల తనకు హీరోయిన్ గా గుర్తింపు రాలేదని దాంతో తమిళ, కన్నడ, హిందీ భాషలలో సినిమాలు చేశానని చెప్పింది.
ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ…. తాను పెళ్లి గురించి ఏం మాట్లాడకపోయినా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని తెలిపింది. పరిశ్రమలోకి రాకముందే తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని సినిమాల్లోకి రావడం అతనికి ఇష్టం లేదని తెలిపింది. దాంతో తాము ఎవరి దారి వాళ్ళు చూసుకున్నామని.. అంతేకాకుండా తనకు ప్రేమపై నమ్మకం పోయిందని పటేల్ వెల్లడించింది.